‘ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపింది;, ప్రధాని మోదీ
ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన..
ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. బీహారీలు డెమాక్రసీలోని తొలి పాఠాన్ని ప్రపంచానికి చాటి చూపారని పేర్కొన్నారు. ఇక ఆ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. వాళ్ళు అభివృద్దికి ఓటేశారు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే ఎన్డీయే మంత్రం ఫలించింది అని మోదీ అన్నారు. ఆ రాష్ట్రంలోని పేద మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారని, అభివృధ్దికి సంబంధించి ఖచ్చితమైన తమ నిర్ణయాన్ని ప్రకటించారని ఆయన అన్నారు.