బెట్టింగ్: అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి
క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకొని ఇద్దరు యువకులు పురుగులమందు తాగిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంకొండలో ఇద్దరు అన్నదమ్ములు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకొన్నారు. దీంతో ఇద్దరూ కలిసి తోటలో పురుగు మందు తాగారు. వీరిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా. కొమరయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు వీళ్లిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తమకు ఎవరిమీదా కోపంలేదంటూ చెప్పుకొచ్చారు. బెట్టింగ్ లో వీరిద్దరు లక్ష రూపాయల వరకూ పొగొట్టుకున్నట్టు […]
క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకొని ఇద్దరు యువకులు పురుగులమందు తాగిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంకొండలో ఇద్దరు అన్నదమ్ములు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకొన్నారు. దీంతో ఇద్దరూ కలిసి తోటలో పురుగు మందు తాగారు. వీరిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా. కొమరయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు వీళ్లిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తమకు ఎవరిమీదా కోపంలేదంటూ చెప్పుకొచ్చారు. బెట్టింగ్ లో వీరిద్దరు లక్ష రూపాయల వరకూ పొగొట్టుకున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ నిర్వాహకుడికి ముప్పై వేలు చెల్లించినట్టు సమాచారం. మరో ఎనభై వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టినట్టు చెబుతున్నారు. దీంతో డబ్బులు కట్టలేక ఆత్మహత్యా యత్నం చేశారు ఇద్దరు యువకులు