నా సినిమా.. నా యూనిట్: హీరో విజయ్ “గోల్డ్ గిఫ్ట్స్” ఎన్నో తెలుసా..?

తమిళ స్టార్ హీరో విజయ్ మరోసారి తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. వీరి కాంబినేషన్‌లో వస్తున్న బిగిల్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. బిగిల్ యూనిట్ సభ్యులను విజయ్ సర్‌ఫ్రైజ్ […]

నా సినిమా.. నా యూనిట్: హీరో విజయ్ గోల్డ్ గిఫ్ట్స్ ఎన్నో తెలుసా..?
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2019 | 3:30 PM

తమిళ స్టార్ హీరో విజయ్ మరోసారి తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. వీరి కాంబినేషన్‌లో వస్తున్న బిగిల్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. బిగిల్ యూనిట్ సభ్యులను విజయ్ సర్‌ఫ్రైజ్ చేశాడు. సినిమా కోసం వివిధ శాఖల్లో పనిచేసిన దాదాపు 400 మందికి గోల్డ్ రింగ్స్ కానుకగా ఇచ్చాడు.

బిగిల్ నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా దళపతి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బిగిల్ కోసం పనిచేస్తున్న 400 మంది సభ్యులకు ఈ సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పారు. ఆయన తమపై కురిపించిన ఆప్యాయత ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా నిలిపిందని ఆమె ట్వీట్ చేశారు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న వర్ష బొల్లమ్మ కూడా.. విజయ్ ఇచ్చిన రింగ్‌ను చూపుతూ ఫోటో దిగి ట్విట్టర్ లో షేర్ చేశారు. గతంలో కూడా విజయ్ ఇలాంటి కానుకలే ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu