Bigg Boss Telugu 4: హారికకు సారీ చెప్పిన అభి
తాజాగా ఇంటి సభ్యులకు కాయిన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తస్కరించడం కూడా ఈ టాస్క్ లో భాగమే. ఈ టాస్క్ లో కొందరు పారదర్శకంగా కాయిన్స్ సేకరిస్తే, మరికొందరు మాత్రం తమలోని చోర కళను ప్రదర్శించారు.
తాజాగా ఇంటి సభ్యులకు కాయిన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తస్కరించడం కూడా ఈ టాస్క్ లో భాగమే. ఈ టాస్క్ లో కొందరు పారదర్శకంగా కాయిన్స్ సేకరిస్తే, మరికొందరు మాత్రం తమలోని చోర కళను ప్రదర్శించారు. ఈ ఆట మధ్యలో తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతికి హెల్ప్ చేయడం ప్రారంభించాడు అభిజిత్. ఈ మధ్య కాలంలో అభి నుంచి కాస్త డిస్టెట్స్ మెయింటైన్ చేస్తోన్న హారిక, ఈ విషయంపై అతడిని స్ట్రైయిట్ గా ప్రశ్నించింది.
“స్వాతి వచ్చి టూ, త్రి డేస్ అవుతుంది, ఆమెకిచ్చిన టాస్క్ చేయలేకపోతుంది. అయినా డేంజర్ జోన్ లో కూడా లేదు. కానీ ఆమె కోసం గొడవ పడి మరీ కాయిన్ సేకరించాల్సిన అవసరమేంటి” అని హారిక అభిజిత్ ను ప్రశ్నించింది. దీంతో అభిజిత్ హారికకు చేయి పట్టుకుని సారీ చెప్పాడు. ఆ తర్వాత స్విచ్ కాయిన్ ను మెహబూబ్ చేతులారా కింద పడేశాడు. అదే పవర్ కాయిన్ అని బిగ్ బాస్ చెప్పడంతో అతడు బిక్కముఖం వేశాడు.
అందరూ పడుకున్న తర్వాత అరియానా గ్లోరీ, లాస్య, సోహైల్ ఒక జట్టుగా మారి మాస్టర్ దగ్గర ఉన్న కాయిన్లు అన్నీ కొట్టేశారు. ఇక ఇంటి సభ్యులంతా రాత్రి నిద్రపోతుంటే..జాగారం చేసి మెహబూబ్, సోహైల్ కాయిన్స్ కొట్టేశారు. ఉదయాన్నే తన కాయిన్లు కనిపించకపోవడంతో మాస్టర్ సోహైల్ పై సీరియస్ అయ్యాడు. ‘మీరు చూస్తేనే దొంగల్లా ఉన్నారు. మీరు ఎలా గెలుస్తారో చూస్తా’ అంటూ సవాల్ విసిరాడు.
మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో మెహబూబ్ 4360 కాయిన్స్ తో ఎక్కువ పాయింట్లు సాధించాడు. అదేవిధంగా సోహైల్ 3620, అవినాష్ 3160 కాయిన్లు సంపాదించారు. అఖిల్ 2570, స్వాతి 1930, అరియానా 1850, అభిజిత్ 1770, హారిక 1450, కుమార్ సాయి 1570, నోయల్ 900, మోనాల్ 610, దివి 110, సుజాత 340+ స్విచ్ కాయిన్స్ సంపాదించుకున్నారు.
Also Read :