మంచిర్యాలలో కలకలం రేపిన పీపీఈ కిట్లు..

అసలే మంచిర్యాల జిల్లాలో ప్రజలు కరోనా భయంతో విలవిలలాడుతుంటే ఇక కరోనా బాధితులకు వైద్యం చేసే డాక్టర్లు ధరించే పీపీఈ కిట్లు అక్కడి స్థానికుల్ని మరింత ఆందోళనకు గురిచేశాయి.

మంచిర్యాలలో కలకలం రేపిన పీపీఈ కిట్లు..
Follow us

|

Updated on: Oct 01, 2020 | 4:00 PM

కరోనా బాధితులకు వైద్యం చేసే డాక్టర్లు వేసుకునే పీపీఈ కిట్లు ( పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల్లో దర్శనమిస్తే ఏమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊరి చివరన పీపీఈ కిట్లు దర్శనం ఇవ్వటంతో అదే జరిగింది. స్థానికుల భయంతో అక్కడ కలకలం రేపింది. అసలే మంచిర్యాల జిల్లాలో ప్రజలు కరోనా భయంతో విలవిలలాడుతుంటే ఇక కరోనా బాధితులకు వైద్యం చేసే డాక్టర్లు ధరించే పీపీఈ కిట్లు శ్మశాన వాటికల్లో, మరుగుదొడ్లలో కనిపించటంతో గ్రామస్తులు మరింత భయాందోళనకు గురయ్యారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పీపీఈ కిట్ల కలకలం రేగింది. స్థానిక శ్మశానవాటిక, డంపింగ్ యార్డుల ప్రాంగణంలోని మరుగుదొడ్డిలో రెండు పీపీఈ కిట్లు కంటపడటంతో పట్టణవాసులు బెంబేలెత్తిపోతున్నారు.  రెండు రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. అయితే, అతడి అంత్యక్రియల సందర్భంలో ఈ పీపీఈ కిట్లు వినియోగించినట్లు ప్రచారం జరిగింది. దీంతో మృతుడు కరోనా వ్యాధితోనే మరణించాడనే ప్రచారం వ్యాపించింది.

అయితే మృతుడు ఎవరు అనేది కూడా తెలియక పోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పీపీఈ కిట్లు వాడిన తర్వాత వాటిని దహనం చేయాల్సి ఉంటుంది. అలాంటిది మరుగుదొడ్డిలో పడి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఈ పీపీఈ కిట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.