‘వాసి వాడి.. తస్సాదియ్యా’..సోగ్గాడు అదిరే జోక్ పేల్చాడు, కంటెస్టెంట్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఎండింగ్ దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగు వెర్షన్ ముగియనుంది. తొలుత తెలిసిన వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో వీక్షకులు కాస్త చిన్నబుచ్చుకున్నారు.

'వాసి వాడి.. తస్సాదియ్యా'..సోగ్గాడు అదిరే జోక్ పేల్చాడు, కంటెస్టెంట్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2020 | 5:44 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఎండింగ్ దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగు వెర్షన్ ముగియనుంది. తొలుత తెలిసిన వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో వీక్షకులు కాస్త చిన్నబుచ్చుకున్నారు. కానీ క్రమక్రమంగా షో రేటింగ్ పుంచుకుంది. ముఖ్యంగా నాగార్జున తన హోస్టింగ్‌తో వీక్షకులను ఉల్లాసపరిచారు. తన మార్కు పంచ్‌లు, రొమాంటిక్ డైలాగ్స్‌తో అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను..ఇటు యూత్‌ను ఆకర్షించారు. గీత దాటిన ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా హుందాగా వ్యవహరించారు. ముఖ్యంగా వారాంతాల్లో నాగ్ వచ్చే ఎపిసోడ్లకు ఓ రేంజ్ రేటింగ్ వస్తుంది. తాజాగా శనివారం ఎపిసోడ్‌లో మరోసారి అదిరిపోయే పంచ్ పేల్చి అందర్నీ ఆకర్షించారు కింగ్.

ఇటీవల  టాస్క్‌లో భాగంగా మోనాల్‌ని అభిజిత్‌ కొన్ని ప్రశ్నలు అడిగి ఆమెను కన్ఫూజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే ‘పిల్లలు ఎలా పుడతారు మోనల్?’ అని కాస్త నాటీగా అడిగాడు. అతడు ఈ ప్రశ్న అడగగానే సోహెల్, అరియానా కంగుతిన్నారు. అరియానా నవ్వలేక అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ప్రశ్నకు మోనల్‌ మాత్రం సూపర్ ఆన్సర్ ఇచ్చింది. ‘‘అమ్మ ఆస్పత్రికి వెళ్తుంది. అక్కడ డాక్టర్ సాయం చేస్తారు. అదొక గిఫ్ట్’’ అని చెప్పుకొచ్చింది.  ఇక ఇదే ప్రశ్నను శనివారం మరోసారి కంటెస్టెంట్ల ముందుకు తెచ్చాడు నాగార్జున.  ‘పిల్ల‌లెలా పుడ‌తారు?’ అని అభిజిత్‌ అడిగిన ప్ర‌శ్న‌ను తిరిగి అత‌డినే అడిగి షాకిచ్చారు. దీంతో కాసేపు ఏం అర్థకాక అభి.. సైలెంట్‌గా నిల్చున్నాడు. దీంతో నాగ్.. ‘ఏడుస్తూ పుడ‌తారు’ అని ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. కింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు‌ కంటెస్టెంట్స్ అందరూ‌ పగలబడి నవ్వారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే