బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్

Bigg Boss 4: కోపాలు, బుజ్జగింపులు, రొమాన్స్, గాసిప్స్.. ఇలా బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని ఇచ్చింది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో..

బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 23, 2020 | 6:13 PM

Bigg Boss 4: కోపాలు, బుజ్జగింపులు, రొమాన్స్, గాసిప్స్.. ఇలా బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని ఇచ్చింది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి మొత్తం 19 మంది సభ్యులు బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీపడగా.. చివరికి అభిజీత్‌ను విజయం వరించింది. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చిన వారిలో కొంతమందికి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. ఆ జాబితాలో సోహైల్ ముందు వరుసలో ఉంటాడు. కానీ అతడికి అనూహ్యంగా ఓ అంశంపై సోషల్ మీడియాలో నెగిటివిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఫైనల్‌కు రెండు రోజుల ముందు ఎలిమినేట్ అయిన సభ్యులు హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల గదిలో ఒక్కొక్కరుగా టాప్ 5 కంటెస్టెంట్లతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో మెహబూబ్ సోహైల్‌తో ఏవో సైగలు చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్‌చల్ చేసింది. సోహైల్ నెంబర్ 3లో ఉన్నట్లు మూడు వేళ్లతో సూచించడమే కాకుండా.. డబ్బుల ఆఫర్ వస్తే వదిలిపెట్టొదని మెహబూబ్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఫ్రెండ్ చెప్పినట్లుగానే సోహైల్ ఫైనల్ ఎపిసోడ్‌లో రూ. 25 లక్షలు తీసుకుని బయటికి వచ్చాడని.. తద్వారా విన్నర్ ప్రైజ్ మనీలో కోత పడిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయంపై తాజాగా సోహైల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లైవ్ వీడియోలో ఫ్యాన్స్‌కు వివరించాడు. ‘బిగ్ బాస్‌లో తర్వాత ఏం జరుగుతున్నది ఎవరికి తెలియదు.? ఎవరు హౌస్‌లో ఉంటారు.? ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఎవరికీ క్లారిటీ ఉండదు.? అసలు మెహబూబ్ ఆరోజు గ్లాస్‌పై చేతి వేళ్లతో ఏమన్నాడో నాకు తెలియదు.! టాప్ 3‌లో నేను ఉంటానని జడ్జ్ చేయడానికి వాడు బిగ్ బాస్ ఏం కాదు. డబ్బులు గెలుచుకుని బయటికి రమ్మని సిగ్నల్ చేసి ఉంటాడు. అసలు వాడు ఏం చెప్పాడో ముందు అర్ధం కాలేదు. ఆ అంశంపై అఖిల్‌తో కూడా తర్వాత చర్చించాను. కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. నిజం మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు. రూ. 25 లక్షలు ఆఫర్ చేస్తే.. ఇద్దరు పంచుకుందాం అని అఖిల్, నేను అనుకున్నాం. అందుకే ఆఫర్‌కు ఒప్పుకున్నాను తప్ప.. మూడో ప్లేస్‌లో ఉంటే డబ్బులు ఇస్తారని తెలియదంటూ సోహైల్ ఆవేదనను వ్యక్తం చేశాడు.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

ఇది స్వచ్ఛమైన హలాల్ మాంసమేనా? హోటల్ సిబ్బందితో టాలీవుడ్ హీరోయిన్
ఇది స్వచ్ఛమైన హలాల్ మాంసమేనా? హోటల్ సిబ్బందితో టాలీవుడ్ హీరోయిన్
కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ..
కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..