AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: కమలం జారి గల్లంతయ్యిందే!

దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సాచ్యురేషన్‌ స్థాయికి చేరడానికి దశాబ్దాలు పడితే, బీజేపీకి ఆరేళ్లలోనే ఈ స్థాయికి చేరినట్లు దేశ ముఖచిత్రం చెబుతోంది. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దేశంలో బీజేపీ భవిష్యత్తుపై ప్రశ్నలవర్షం కురుస్తోంది. ఇదేసమయంలో అన్నిపార్టీలు తమ వెంట నిలవాలని కాంగ్రెస్‌ వెల్‌కమ్‌ సాంగ్‌ ప్లే చేస్తోంది. బీజేపీకి హిందుత్వ అంశం ఓట్లు కురిపించడం లేదా, ఆ పార్టీ డౌన్‌ట్రెండ్‌ మొదలైందా అన్న అంశంపై ఇవాళ్టి […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: కమలం జారి గల్లంతయ్యిందే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 23, 2019 | 10:41 PM

Share

దేశంలో బీజేపీ హవా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సాచ్యురేషన్‌ స్థాయికి చేరడానికి దశాబ్దాలు పడితే, బీజేపీకి ఆరేళ్లలోనే ఈ స్థాయికి చేరినట్లు దేశ ముఖచిత్రం చెబుతోంది. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దేశంలో బీజేపీ భవిష్యత్తుపై ప్రశ్నలవర్షం కురుస్తోంది. ఇదేసమయంలో అన్నిపార్టీలు తమ వెంట నిలవాలని కాంగ్రెస్‌ వెల్‌కమ్‌ సాంగ్‌ ప్లే చేస్తోంది. బీజేపీకి హిందుత్వ అంశం ఓట్లు కురిపించడం లేదా, ఆ పార్టీ డౌన్‌ట్రెండ్‌ మొదలైందా అన్న అంశంపై ఇవాళ్టి బిగ్‌డిబేట్‌.

గత లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్‌ హ్యాండ్‌తో 303 సీట్లను బీజేపీ గెలిచినా, రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యపై అనుకూల తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం వంటి ధమాకాలు ఉన్నా రాష్ట్రాల్లో అధికారం చేజారుతోంది. ఈ ఏడాదిలో మహారాష్ట్రలో శివసేనకు దూరమై బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. మహా షాక్‌ తర్వాత జార్ఖండ్‌ ఎన్నికల్లో ఓటమితో దేశంలో కమలం వాడిపోతోందన్న సంకేతాలు బలంగా వెళుతున్నాయి. 81 సీట్లున్న అసెంబ్లీలో- మ్యాజిక్‌ ఫిగర్‌ 42 సీట్లను కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి చేరుకుంది. మైనింగ్‌ స్టేట్‌ జార్ఖండ్‌లో కాంగ్రెస్‌, జేఎంఎం సంబరాలు ఊపందుకున్నాయి.

జార్ఖండ్‌ సీఎం రఘుబర్‌ దాస్‌ ఓటమిని ఒప్పుకుని రాజీనామా చేశారు. సీఎం కుర్చీలో కూర్చోడానికి జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ రెడీ అయ్యారు. ఓడిపోయిన బీజేపీ సాకులు వెతుక్కునే పనిలో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకనే ఓడిపోయామని బీజేపీ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..