బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: నవంబర్ 1 కాదు.. జూన్ 2నే ఏపీ అవతరణ!

రాజధాని, హైకోర్టు అంశాలపై ఏపీ రాజకీయాల్లో ప్రతీ రోజూ వాడివేడి చర్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు ఇదే కోవలో రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసిన అవతరణ వేడుకలను జగన్ సర్కార్ నిర్వహిస్తోంది. రేపు అనగా నవంబర్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: నవంబర్ 1 కాదు.. జూన్ 2నే ఏపీ అవతరణ!
Follow us

|

Updated on: Nov 01, 2019 | 12:30 AM

రాజధాని, హైకోర్టు అంశాలపై ఏపీ రాజకీయాల్లో ప్రతీ రోజూ వాడివేడి చర్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు ఇదే కోవలో రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసిన అవతరణ వేడుకలను జగన్ సర్కార్ నిర్వహిస్తోంది. రేపు అనగా నవంబర్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇదిలా ఉంటే ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తోంది. తాము ఏది చేస్తే.. అందుకు రివర్స్‌గా వెళ్లడమే జగన్ విధానం అంటూ ఎద్దేవా చేస్తోంది. తెలంగాణ విడిపోయి.. నవ్యాంధ్ర ఏర్పడ్డాక కూడా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకులు ఎలా నిర్వహిస్తారని చంద్రబాబు తెలిపారు. ఇక ఈ వాదనను తోసిపుచ్చిన వైసీపీ ప్రభుత్వం..  పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి నవంబర్ 1న అవతరణ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ రెండు పార్టీల వాదన ఇలా ఉంటే.. బీజేపీ ధోరణి మాత్రం మరోలా ఉంది. నవంబర్ 1న, జూన్ 2న కూడా వేడుకలు నిర్వహించవన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు.  ఇక ఈ అవతరణ దినోత్సవ రగడపై బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు ఏమన్నారో ఆయన మాటల్లోనే..