ప్రకాశం వైసీపీలో అధిపత్యపోరు.. ‘సాఫ్ట్‌వేరోడు.. సాఫ్ట్‌గా ఉంటాడనుకుంటున్నావేమో..? కేరాఫ్ దర్శి సెంటర్.. రా.!’
నీ బలగమెంత? నా బలమెంత? పార్టీ ఆశీస్సులు నీకున్నాయా? నాకున్నాయా? ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కేరాఫ్ దర్శి సెంటర్. ప్రకాశంజిల్లా...

నీ బలగమెంత? నా బలమెంత? పార్టీ ఆశీస్సులు నీకున్నాయా? నాకున్నాయా? ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కేరాఫ్ దర్శి సెంటర్. ప్రకాశంజిల్లా వైసీపీలో అధిపత్యపోరు ఈ స్థాయిలో ఉప్పొంగుతోంది. ఇద్దరూ ఒక పార్టీ నేతలే అయినా.. ప్రత్యర్థుల్లా పోటీ పడుతున్నారు. నీ ప్రతాపమా.. నా ప్రతాపమా అంటూ రంకెలు వేస్తున్నారు. పార్టీ కోసం పని చేసేది తానంటే తాను అని ప్రకటించుకుంటున్నారు. జగన్ ఆశీస్సులు తన కంటే తనకు అని పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.. ఇద్దరూ కలిసి ఉన్నట్లే కనిపించినా.. తాజాగా లోపలున్న ఒరిజినాలిటీ బయటపడింది. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఇది బయటపడింది. ఎవరికి వారే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో నిన్నటి వరకు అంతర్గతంగా ఉన్న వైసీపీ పోరు ఇప్పుడు రచ్చకెక్కింది.
సాఫ్ట్‌వేరోడు.. సాఫ్ట్‌గా ఉంటాడనుకుంటున్నావేమో.. ఆ సాఫ్ట్ వెనుక బండరాయంత గుండె ఉంది అంటూ డైలాగ్ పేల్చారు ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి. దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. క్యాడర్‌ని గాలికొదిలేసి పారిపోయిన నీకు పెత్తనం కావాలా అంటూ విమర్శించారు ఎమ్మెల్యే వేణుగోపాల్. శివప్రసాద్‌రెడ్డిపై శివాలెత్తుతూ విరుచుకుపడ్డారు. తాను దాచుకోవడానికి, దోచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. దర్శిలో అటు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఇటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. జగన్ జన్మదిన వేడుకల సాక్షిగా ఇద్దరూ దర్శిలో సవాళ్లు విసురుకోవడం పార్టీలో చర్చనీయాశంగా మారింది.