మూడో దశ ట్రయల్స్ లో ‘కోవాగ్జిన్’, తొలి, రెండో దశ ట్రయల్స్ విశ్లేషణ సక్సెస్, భారత్ బయోటెక్
తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న 'కోవాగ్జిన్' వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. కోవిడ్19 కి సంబంధించిన ఇతర వ్యాక్సీన్ల..
తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాగ్జిన్’ వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. కోవిడ్19 కి సంబంధించిన ఇతర వ్యాక్సీన్ల విషయంలో కూడా తమ కంపెనీ అధ్యయనం చేస్తోందని ఆయన చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇది ముక్కులో వేసుకునే డ్రాప్స్ మాదిరి ఉంటుందని, వచ్ఛే ఏడాదికల్లా సిధ్ధమవుతుందని వివరించారు. కోవిడ్-వ్యాక్సిన్ డెవలప్ మెంట్ విషయంలో మేం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థతో భాగస్వామిగా ఉన్నాం అని కృష్ణ ఎల్లా వెల్లడించారు. బయో సేఫ్టీ లెవెల్ 3 గల వ్యాక్సీన్ ను ఉత్పత్తి చేస్తున్నది ప్రపంచంలో భారత్ బయో టెక్ ఒక్కటే అన్నారు. కోవాగ్జిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక విశ్లేషణ విజయవంతంగా పూర్తిఅయిందని ఇటీవల ఈ సంస్థ తెలిపింది. అటు-మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో సుమారు 26 వేలమంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.