అళగిరి యాక్టివవడం వెనుక ఎవరున్నారు? సొంతంగా పార్టీ పెట్టేన్నివనరులు ఉన్నాయా? డీఎంకేను చీల్చే సత్తా అళగిరికి ఉందా?
ఇంతకాలం మౌనంగా, స్తబ్దుగా ఉన్న అళగిరికి సడన్‌గా పార్టీ క్యాడర్‌తో సమావేశం పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇది భారతీయ జనతాపార్టీ వ్యూహం కాదు కదా? అళగిరితో కొత్త పార్టీ పెట్టించి..
ఇంతకాలం మౌనంగా, స్తబ్దుగా ఉన్న అళగిరికి సడన్‌గా పార్టీ క్యాడర్‌తో సమావేశం పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇది భారతీయ జనతాపార్టీ వ్యూహం కాదు కదా? అళగిరితో కొత్త పార్టీ పెట్టించి డీఎంకే ఓట్లు చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడులోనూ సత్తా చాటాలన్నదే బీజేపీ లక్ష్యం.. మరో ఆరు నెలలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.. అందుకే ఇప్పట్నుంచే కసరత్తులు మొదలు పెట్టింది. తమిళనాడులో పార్టీలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.. అన్నాడీఎంకేకు తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు డీఎంకే వ్యతిరేక కూటమిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.. అలాగే డీఎంకే, కాంగ్రెస్‌లలో ఉన్న కీలక నేతలపై ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించసాగింది.. కాంగ్రెస్ నుంచి ఖుష్బూ బయటకు వచ్చి బీజేపీలో చేరారంటే ఇదే కారణం.. ఇక డీఎంకే అధినేత స్టాలిన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ఆయన అన్న అళగిరిని రంగంలోకి దించాలనే ప్లాన్ వేసింది. ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు అళగిరితో సమావేశమయ్యారట! ఈ నెల 21న తమిళనాడులో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో అళగిరి సమావేశం కాబోతున్నారట! ఆయనతో సొంతంగా పార్టీ పెట్టించి, డీఎంకేకు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలన్నది బీజేపీ వ్యూహంలో భాగం. కరుణానిధి మరణం తర్వాత డీఎంకే మనుగడ కష్టమేననుకున్నారు.. అన్నదమ్ముల గొడవలతో పార్టీ చీలిపోతుందనుకున్నారు.. అయితే అళగిరికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టగలిగారు స్టాలిన్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే అళగిరిని పార్టీ నుంచి తొలగించారు స్టాలిన్.. పార్టీని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. కరుణానిధి బతికున్న రోజుల్లోనే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. మరికొద్ది నెలలలో ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు అళగిరి. మరోసారి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతున్నారు. తనను అవమానించి బయటకు పంపించిన స్టాలిన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమయ్యిందని అనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న డీఎంకేను దెబ్బకొట్టడం తన ఒక్కడివల్ల కాదని తెలుసుకున్న అళగిరి బీజేపీ సాయాన్ని అర్థిస్తున్నారు. బీజేపీకి కావాల్సింది కూడా ఇదే! కొత్తగా పార్టీ స్థాపించడం సాధ్యం కాకపోతే బీజేపీలో చేరాలనే అభిప్రాయంతో ఉన్నారు అళగిరి.