కార్పొరేటర్లపై క్రిమినల్ కేసులు.. క్రైమ్ హిస్టరీ సంపాదించిన టీవీ9.. మహిళా కార్పొరేటర్లపైనా కేసులు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అభ్యర్థుల క్రిమినల్ హిస్టరీ బయటికొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే వారిలో ఎందరు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగి వున్నారనే విషయం తేటతెల్లమైంది. టీవీ9 సంపాదించిన హిస్టరీ షీట్‌ ఎంత మంది కార్పొరేటర్లపై క్రిమినల్ కేసులున్నాయో వెల్లడైంది.

కార్పొరేటర్లపై క్రిమినల్ కేసులు.. క్రైమ్ హిస్టరీ సంపాదించిన టీవీ9.. మహిళా కార్పొరేటర్లపైనా కేసులు
Follow us

|

Updated on: Nov 16, 2020 | 5:28 PM

Corporators facing criminal charges: త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రస్తుతమున్న సిట్టింగ్ కార్పొరేటర్ల క్రిమినల్ హిస్టరీని సంపాదించింది టీవీ9 ఛానల్. జీహెచ్ఎంసీకి 2016లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 72 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు హిస్టరీలో తేలింది. గమ్మత్తేంటంటే.. గెలిచిన తర్వాత కూడా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారి సంఖ్య కూడా పదుల్లో వుండడం. మొత్తమ్మీద అన్ని పార్టీలకు చెందిన వారిపైనా క్రిమినల్ కేసులున్నట్లు ఈ నివేదిక తేల్చింది.

టీవీ9 చేతిలో హైదరాబాద్ కార్పొరేటర్ల నేర చరిత్ర లభ్యమైంది. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 72 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు నివేదికలో తేలింది. గ్రేటర్ పరిధిలో 51 డివిజన్‌లలో పోటీ చేసిన అభ్యర్థులపై కేసులున్నాయని వెల్లడైంది. అప్పట్లో పోటీ చేసిన వారిలో టీడీపీ-13, కాంగ్రెస్‌-13, టీఆర్ఎస్-14, బీజేపీ-4, ఎంఐఎం-11, ఎంబీటీ-2, ఇతరులు -11 మంది అభ్యర్థులపై కేసులు నమోదై వున్నట్లు నివేదిక పేర్కొంది.

మొత్తం 64 మంది పురుషులు, 8 మంది మహిళా కార్పొరేటర్లపై కేసులున్నట్లు తేలింది. 2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసులు ఎదుర్కొంటున్నవారు 30 మంది కాగా.. కేసులు ఎదుర్కొంటున్న 30 మందిలో టీఆర్ఎస్-16, ఎంఐఎం-13, బీజేపీ-1గా వుంది. ఈ నాలుగేళ్ల కాలంలో మరో 17 మందిపై కొత్తగా కేసులు నమోదు అయినట్లు రిపోర్టులో ప్రస్తావించారు. కొత్తగా కేసులు నమోదైన 17 మందిలో టీఆర్ఎస్-10, ఎంఐఎం-17 మందిపై కేసులు బుక్కయ్యాయి.

ALSO READ: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ALSO READ: అభివృద్ధి పనులకు ఎన్నికల కమిషన్ అనుమతి

ALSO READ: నడిరోడ్డుపై రివాల్వర్‌తో వీరంగం

ALSO READ: సామాజిక సేవ పేరుతో మోసం.. 3 కోట్ల మేరకు..