‘చిట్టీ’ డబ్బులు రాక మనస్తాపం.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్య

చిట్టీ పాడుకుని ఆ డబ్బులు ఇచ్చేందుకు యువకునికి చిట్టి వ్యాపారి చెయ్యిచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడి ఆత్మహత్య.

'చిట్టీ' డబ్బులు రాక మనస్తాపం.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్య
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 16, 2020 | 5:02 PM

చిట్టీ పాడుకుని ఆ డబ్బులు ఇచ్చేందుకు యువకునికి చిట్టి వ్యాపారి చెయ్యిచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు అతని ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి అయ్యాడు. ఈ విషాద ఉదంతం తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఫైసా ఫైసా కూడబట్టి చిట్టి వేసుకున్నాడు. తీరా అవరసరానికి పాడుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో బలవన్మరణానిక పాల్పడ్డాడు.

తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతంలో కార్పెంటర్ గా పని చేస్తున్న బాలసుబ్రమణ్యం , స్థానికంగా ఉన్న మరియా సెల్వం దగ్గర నెల, నెల చిట్టి కడుతూ వచ్చాడు. ఇదే క్రమంలో తన చిట్టి డబ్బులు రోజులు గడుస్తున్నా మరియసెల్వం ఇవ్వకపోవడంతో అతని ఇంటిముందు ధర్నాకు దిగాడు. ఇక డబ్బులు రావనే నిర్ధారించుకున్న బాలసుబ్రమణ్యం తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో మరియసెల్వం ఇంటి ముందే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు బాలసుబ్రమణ్యం. మరియసెల్వం కళ్లముందే బాలసుబ్రమణ్యం ఒళ్లంతకాలిపోతున్నా.. కనీసం పట్టించుకోలేదు. తీవ్రంగా గాయపడ్డ బాలసుబ్రమణ్యాన్ని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రమణ్యం తుదిశ్వాస విడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.