సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం.. సకాలంలో స్పందించిన పోలీసులు.. తప్పిన ప్రమాదం..
సంగారెడ్డి జిల్లాలో పట్టపగలు కాల్పులమోత కలకలం సృష్టించింది.
సంగారెడ్డి జిల్లాలో పట్టపగలు కాల్పులమోత కలకలం సృష్టించింది. జహీరాబాద్ మండలం గోవిందాపూర్ శివారులో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. భూవివాదం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఓ వర్గంపై మరో వర్గానికి చెందిన వ్యక్తి నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న చిరాగ్ పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఉద్రిక్తతను చల్లార్చారు. ఈ కాల్పులు, ఘర్షణకు సంబంధించి కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కాల్పుల్లో ఎవరికీ ఏం ప్రమాదం జరుగలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.