AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..!

కరోనా పుణ్యామాని భక్తుల కోలాహలం లేక మహారాష్ట్రలోని షిరిడీ ఆలయం బోసిపోయింది. ఎట్టకేలకు ఏడు నెలల అనంరతం సాయిబాబా దేవాలయం తెరుచుకుంది.

షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
Balaraju Goud
|

Updated on: Nov 16, 2020 | 3:45 PM

Share

కరోనా పుణ్యామాని భక్తుల కోలాహలం లేక మహారాష్ట్రలోని షిరిడీ ఆలయం బోసిపోయింది. ఎట్టకేలకు ఏడు నెలల అనంరతం షిరిడీలోని సాయిబాబా దేవాలయం తెరుచుకుంది. ఇంతకాలం నిత్యా పూజలకే పరిమితమైన సాయినాథుడు ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనిమిస్తున్నాడు.

మహారాష్ట్రలో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీలో మార్చి 17వ తేదీ నుంచి భక్తల దర్శనాలు నిలిపివేశారు. ఆన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో తిరిగి భక్తుల రాకపోకలకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెరుచుకున్న ఆలయంలో కఠిన నియమ నిబంధనలు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

సాయిబాబా దర్శనానికి దశమ నిబంధనలుః

1. పది సంవత్సరాలలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారికి షిరిడీలో దర్శనానికి అనుమతి లేదు.

2. దర్శనం కోసం స్థానికులకు టోకెన్లు ఇస్తారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆన్‌లైన్‌లో పాస్‌ తీసుకోవాలి. వారికి కేటాయించిన టైమ్‌ స్లాట్‌ ప్రకారమే దర్శనానికి రావాల్సి ఉంటుంది.

3. తమకు కొవిడ్‌ లేదని తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని ప్రతి ఒక్కరు గేటు వద్దనే చూపాలి.

4. బాబా సమాధి, ద్వారకా మయి ఆలయాల దర్శనానికి భక్తులకు అనుమతి లేదు.

5. భక్తులు చెప్పులను లేకుండా ఆలయంలోకి ప్రవేశించాలి.

6. భక్తులు స్వయంగా ప్రసాదాలను నివేదించడం, తీర్థాన్ని జల్లటం వంటి వాటికి అనుమతి లేదు.

7. ఆలయ పరిసరాలు, క్యూలలో మాస్కులను ధరించటం, సామాజిక దూరం తప్పనిసరి.

8. కాళ్లు కడుక్కోవటం, ఉష్ణోగ్రత కొలిచేందుకు, శానిటైజేషన్‌ ఏర్పాట్లు దర్శనం క్యూలోనే ఉంటాయి.

9. ఆలయంలోని విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను చేతితో తాకకూడదు.

10. ఆలయ ప్రాంగణంలో భక్తులు గుంపులుగా కూడేందుకు అనుమతి లేదు.

అయితే, భక్తుల సంక్షేమం కోసమే తాము ఈ నియమ నిబంధనలు ఏర్పాటుచేశామని.. ఇందుకు అందరూ సహకరించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి కన్హురాజ్‌ బగాతే కోరారు.

Follow Us
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?
త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. విజయ్ అలా ప్లాన్ చేశారా?