మన్మోహన్ సింగ్ కి ప్రశంస, మోదీకి మొండిచెయ్యి, ఒబామా పుస్తకం చెప్పే కథలెన్నో ! శశిథరూర్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని ఎంతగానో ప్రశంసించారని, కానీ ప్రధాని మోదీ గురించి అస్సలు ప్రస్తావించలేదని..

మన్మోహన్ సింగ్ కి ప్రశంస, మోదీకి మొండిచెయ్యి, ఒబామా పుస్తకం చెప్పే కథలెన్నో ! శశిథరూర్
Follow us
Umakanth Rao

| Edited By: Balu

Updated on: Nov 16, 2020 | 3:39 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని ఎంతగానో ప్రశంసించారని, కానీ ప్రధాని మోదీ గురించి అస్సలు ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ‘ఎ ప్రామిస్డ్ లాండ్’పేరిట ఒబామా రాసిన బుక్ ని తాను పూర్తిగా చదివానని, అందులో మోదీ ప్రస్తావనే లేదన్నారు. 902 పేజీలున్న ఈ బుక్ లో ఒబామా.. మన్మోహన్ సింగ్ ని ఉత్తమ రాజకీయ నేతగా అభివర్ణించారు. మన్మోహన్ కి, తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు.. అని శశిథరూర్ ట్వీట్ చేశారు. హింస, ద్వేషం, అవినీతి, రేసిజం, పరమత అసహనం వంటివాటి వల్ల కలిగే దుష్పరిణామాలను ఆయన సుదీర్ఘంగా తన అభిప్రాయాలను వెల్లడించారని శశిథరూర్ తెలిపారు. అయితే తమపార్టీకే చెందిన నేత రాహుల్ గాంధీ గురించి ఒబామా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని శశిథరూర్ నేర్పుగా పక్కన పెట్టారు. ఆ కామెంట్స్ అసమంజసమని శివసేన నేత సంజయ్ రౌత్ ఖండించారు కానీ శశిథరూర్ మాత్రం దీనిపై మౌనం వహించారు.