నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తాం, తేజస్వి యాదవ్ పార్టీ, ఇది ప్రజా తీర్పునకు వ్యతిరేకం

బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామని తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రకటించింది. అసలు ప్రజలు ఇఛ్చిన తీర్పు ఎన్డీయేకి..

  • Umakanth Rao
  • Publish Date - 4:26 pm, Mon, 16 November 20
నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తాం, తేజస్వి యాదవ్ పార్టీ, ఇది ప్రజా తీర్పునకు వ్యతిరేకం

బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామని తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రకటించింది. అసలు ప్రజలు ఇఛ్చిన తీర్పు ఎన్డీయేకి వ్యతిరేకంగా ఉందని ఈ పార్టీ ట్వీట్ చేసింది. ప్రజల తీర్పును ప్రభుత్వ ఆర్డర్ గా మార్చేశారని, వారిలో ఎవరిని అడిగినా తాము ఎన్డీయేకి వ్యతిరేకంగా తీర్పునిచ్చామని చెబుతారని పేర్కొంది. మేం ప్రజాప్రతినిధులం, వారి వెంటే ఉంటాం అని తేజస్వి అన్నారు. జేడీ-యూ, బీజేపీలలో ఒకటి బలహీనమైనది కాగా మరొకటి అవినీతికరమైన పార్టీ అని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని ఆయన దుయ్యబట్టారు. చివరలో పోలైన పోస్టల్ బ్యాలట్ ఓట్లను లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు.