పోలీసు అధికారి స్టైల్‌గా ‘షోలే’ డైలాగ్ చెప్పాడు..లేని పోని చిక్కుల్లో పడ్డాడు
అమితాబ్ బచ్చన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? నార్త్ మాత్రమే కాదు సౌత్ జనాలు కూడా బిగ్ బిని అభిమానిస్తారు. బేస్ వాయిస్‌లో ఆయన సినిమాలలో చెప్పిన డైలాగ్స్‌ను వల్లె వేస్తూ ఉంటారు.
అమితాబ్ బచ్చన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? నార్త్ మాత్రమే కాదు సౌత్ జనాలు కూడా బిగ్ బిని అభిమానిస్తారు. బేస్ వాయిస్‌లో ఆయన సినిమాల్లో చెప్పిన డైలాగ్స్‌ను వల్లె వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ‘షోలే’ సినిమాలోని గబ్బర్ సింగ్ డైలాగ్ అయితే చాలా ఫేమస్. తాజాగా ఆ డైలాగ్‌ను ఓ పోలీస్ ఆఫీసర్ జీపునకు అమర్చిన మైకులో చెప్పి లేనిపోని చిక్కుల్లో పడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జాబువా పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది.
జాబువాలో ఓ పోలీసు అధికారి తన జీపునకు అమర్చిన మైకులో షోలే చిత్రంలోని గబ్బర్ సింగ్ డైలాగులను చెప్తూ హల్‌చల్ చేశారు. సదరు వీడియో సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో అతనికి పోలీసు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీచేశారు. పోలీసు అధికారి గబ్బర్ సింగ్ డైలాగ్ వల్లె వేయడంపై తాము విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ ఆనంద్ సింగ్ తెలిపారు.
Also Read :
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !
ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా