Bharat Bandh: రైతుల ఆందోళన దేశ వ్యాప్తం కావాలి, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, నినదించిన అన్నాహజారే
రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజికవేత్త 83 ఏళ్ళ ఏళ్ళ అన్నాహజారే మంగళవారం రోజంతా నిరశనకు దిగారు. అహమద్ నగర్ లోకి తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆయన తన మద్దతుదారులతో కలిసి దీక్షకు కూర్చున్నారు. ఈ నిరసన దేశ వ్యాప్తం కావాలని..

రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజికవేత్త 83 ఏళ్ళ ఏళ్ళ అన్నాహజారే మంగళవారం రోజంతా నిరశనకు దిగారు. అహమద్ నగర్ లోకి తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆయన తన మద్దతుదారులతో కలిసి దీక్షకు కూర్చున్నారు. ఈ నిరసన దేశ వ్యాప్తం కావాలని, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. ప్రభుత్వం దిగివఛ్చి అన్నదాతల ప్రయోజనాలను కాపాడగలదని ఆయన ఓ రికార్డెడ్ మెసేజ్ లో పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనను ప్రశంసిస్తూ ఆయన, ఈ పది రోజుల్లో అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటన జరగకపోవడం ముదావహమన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు వీధుల్లోకి రావాలని, అయితే ఎవరూ హింసకు పాల్పడరాదని అన్నాహజారే కోరారు. తమ డిమాండ్లను సాధించేందుకు రైతులకు ఇదే తగిన సమయమని ఆయన పేర్కొన్నారు. లోగడ కూడా తాను ఈ విధమైన ఆందోళనలో పాల్గొన్నానని, ఇకపై కూడా ఈ వైఖరిని కొనసాగిస్తానని అన్నాహజారే ప్రకటించారు.
కాగా ఒకనాడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతికెక్కిన అన్నాహజారే అకస్మాత్తుగా రైతుల ఆందోళనకు మద్దతు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రధాని మోదీ గానీ, సీనియర్ బీజేపీ నేతలు గానీ ఈ సామాజికవేత్తను పట్టించుకోకపోవడం విచారకరమనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.