ఆడంబరం లేకుండా గణేష్ నిమజ్జనం…

నిమజ్జనం సెప్టెంబర్‌ ఒకటో తేదీన సాంప్రదాయం ప్రకారం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. నగరంలో మొత్తం 1 లక్ష,10 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని వాటిని వివిధ రోజుల్లో నిమజ్జనం చేస్తారని అన్నారు.

ఆడంబరం లేకుండా గణేష్ నిమజ్జనం...
Follow us

|

Updated on: Aug 29, 2020 | 7:56 PM

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం ఆడంబరం లేకుండా జరుగుతుందని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి  ప్రధానకార్యదర్శి భగవంత్‌రావు అన్నారు. కరోనా నిబంధనలకు అనుసరించి వినాయక నిమజ్ఞనం జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తుల మధ్య దూరంతోపాటు.. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని కోరారు.

నిమజ్జన సమయంలో ఎలాంటి ప్రసాద వితరణ చేయకూడదని అన్నారు. కరోనా ఆంక్షల్లో భాగంగా ఎలాంటి సభలు నిర్వహించవద్దని అన్నారు. మంచినీళ్ల పంపిణీ చేయవద్దనన్నారు. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ వినాయకుల నిమజ్జనం సెప్టెంబర్‌ ఒకటో తేదీన సాంప్రదాయం ప్రకారం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. నగరంలో మొత్తం 1 లక్ష,10 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని వాటిని వివిధ రోజుల్లో నిమజ్జనం చేస్తారని అన్నారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీసులు నిమజ్జనానికి సహకరించాలని భగవంత్‌రావు కోరారు.