భాగ్యలక్ష్మి ఆలయం పేరు మీదనే భాగ్యనగరం.. దాదాపుగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయం..
హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది, దాదాపుగా 400 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం ఆలయం పేరు మీదనే హైదరాబాద్‌ను భాగ్యనగరం అని పిలిచేవారు.
హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది, దాదాపుగా 400 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం ఆలయం పేరు మీదనే హైదరాబాద్‌ను భాగ్యనగరం అని పిలిచేవారు. అలాగే భాగమతి పేరు మీద నవాబులు హిందువుల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా కొంతమంది చెబుతారు. ఈ ఆలయంలో లక్ష్మీదేవి కొలువు దీరింది. ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతాయి. శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఐదుసార్లు అమ్మవారికి హారతి ఇస్తారు. హిందువుల సంప్రదాయం ప్రకారం దీపావళి, బోనాల పండుగ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అయితే కొంతమంది చరిత్ర కారులు మాత్రం ఇది వాస్తవం కాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని చరిత్ర పుస్తకాల్లో మరో విధంగా ఉంది. మహమ్మద్ కులీ అనే ఐదో కుతుబ్ షాహీ రాజు, భాగమతి అనే హిందూ అమ్మాయిని ప్రేమించాడని, ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రాంతంలో చించలం అనే గ్రామంలో ఆ అమ్మాయి ఉండేదని తెలిపారు. ఆమెను చూడ్డానికి రోజూ యువరాజు గోల్కొండ నుంచి నది దాటి అక్కడకు వెళ్లేవాడని తెలిపారు. కొడుకు బాధ చూడలేక ఆ నదికి వంతెన కట్టించాడు తండ్రి ఇబ్రహీం. తర్వాత కులీ భాగమతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె పేరు భాగమతి నుంచి హైదర్ మహల్ అని మారింది.
అమిత్ షా హైదరాబాద్ టూ లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్‌ను క్లిక్ చేయండి