బెర్లిన్‌లో ఒకేసారి 350 మంది అరెస్ట్… కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆందోళన.. తోపులాటలో పోలీసులకు గాయాలు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అయా దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అయా దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆందోళనకు దిగినవారిని అరెస్ట్ చేయడంతో పాటు వారిని జైలుకు పంపారు జర్మనీ పోలీసులు. ఇదే క్రమంలో బెర్లిన్‌లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న 365 మందిని అరెస్టు చేశారు బెర్లిన్ పోలీసులు. అయితే, వారు కరోనా నిబంధనలను అతిక్రమించారనీ, అందుకనే వారిపై చర్యతీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
దేశంలో కరోనాపై పోరాడేందుకు విధించిన నిబంధనలపై అధికారంలోకి రానున్న చట్టంపై ఈ నిరసన చేస్సున్నారని, వారిలో ఇద్దరిని కస్టడీలో ఉంచామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ నిరసనలను అడ్డుకుంటున్న కొందరు పోలీసులు కూడా గాయపడ్డారని అధికారులు చెప్పారు. కాగా, సెంట్రల్ బెర్లిన్‌లోని భవనం వద్ద ఆందోళనకారులు ప్రదర్శన చేపట్టారు. వారిని నివారించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో… వారిపై వాటర్ కానన్స్, గ్యాస్‌ను పోలీసులు వాడినట్లు సమాచారం. అయితే, ఈ నిరసనలకు అసలుకారణం ఇటీవల ప్రభుత్వానికి కరోనా నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మాస్క్ ధరిచడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వం తీరుపై నిరసన చేపట్టారు.