ట్రాఫిక్ చలానాల వసూలుకు ప్రైవేటు సంస్థలు..?

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నగర ట్రాఫిక్ పోలీసులు (బీటీపీ) ట్రాఫిక్ ఉల్లంఘనదారుల నుంచి చలానాల వసూలుకు

ట్రాఫిక్ చలానాల వసూలుకు ప్రైవేటు సంస్థలు..?
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 11:50 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నగర ట్రాఫిక్ పోలీసులు (బీటీపీ) ట్రాఫిక్ ఉల్లంఘనదారుల నుంచి చలానాల వసూలుకు ప్రైవేటు పార్టీలను రంగంలోకి దించాలనుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కార్యకలాపాల కోసం కాంటాక్ట్‌లెస్ సిస్టమ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిక్ఐ యాప్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనదారుని వాహనం రిజిస్ట్రేషన్ నంబరును గుర్తించి, జరిమానాలు వసూలు చేస్తున్నారు. దాదాపు 50 శాతం జరిమానాలు ఈ పద్ధతిలోనే వసూలు చేస్తున్నారు.

ప్రస్తుతం 50 శాతం జరిమానాలు మాత్రమే వసూలు చేయబడుతున్నాయి. ట్రాఫిక్ చలానాలు చాలా వరకు ఉల్లంఘనదారులకు చేరడం లేదు. వాహనదారులు ఇచ్చిన చిరునామాలు సరైనవి కాదు. కాబట్టి చలానాలను పంపించడానికి, జరిమానాలను వసూలు చేయడానికి ప్రైవేటు సంస్థలను రంగంలోకి దించాలనే ఆలోచన వచ్చింది. దీనిపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. ఈ విషయాన్ని బెంగళూరు ట్రాఫిక్ ప్లానింగ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కవిత కూడా ధ్రువీకరించారు.