ఇకపై ‘ఉల్లి దోశ’ బంద్..!

కోయకుండానే ఉల్లి ఘాటు.. కన్నీరు తెప్పిస్తోంది. దేశంలోని ఏప్రాంతంలో.. చూసినా ఉల్లి కొరత.. తీవ్రంగా ఉంది. దీంతో… ఉల్లి ధరలు ఏకంగా.. కిలో 100 రూపాలయకు పైగానే పలుకుతున్నాయి. ఇక దొంగలైతే.. బంగారం, డబ్బులను దోచుకోవడం మానేసి.. ఉల్లిపాయలను ఎత్తుకెళ్తున్నారంటే.. వీటి ధర ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. బెంగుళూరు నగరంలో.. ఇకపై ఉల్లి దోశలను బంద్ చేస్తూ.. చిన్నాచితకా.. హోటల్ వ్యాపారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అదేమని అడిగితే.. ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నాయని […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:21 pm, Sun, 1 December 19
ఇకపై 'ఉల్లి దోశ' బంద్..!

కోయకుండానే ఉల్లి ఘాటు.. కన్నీరు తెప్పిస్తోంది. దేశంలోని ఏప్రాంతంలో.. చూసినా ఉల్లి కొరత.. తీవ్రంగా ఉంది. దీంతో… ఉల్లి ధరలు ఏకంగా.. కిలో 100 రూపాలయకు పైగానే పలుకుతున్నాయి. ఇక దొంగలైతే.. బంగారం, డబ్బులను దోచుకోవడం మానేసి.. ఉల్లిపాయలను ఎత్తుకెళ్తున్నారంటే.. వీటి ధర ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. బెంగుళూరు నగరంలో.. ఇకపై ఉల్లి దోశలను బంద్ చేస్తూ.. చిన్నాచితకా.. హోటల్ వ్యాపారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అదేమని అడిగితే.. ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నాయని సమాధానాలు చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా.. పెద్ద పెద్ద హోటల్స్‌లో తప్పించి.. ఎక్కడా టిఫిన్ వ్యాపారులు ఉల్లి దోశలను వేయడం లేదు. అంతేకాకుండా.. కర్రీస్ పాయింట్స్‌లో కూరల ధరలను కూడా పెంచేశారు. దీంతో.. కొనేవారు లబోదిబోమంటున్నారు.