ఫడ్నవీస్ ను ఉధ్దవ్ పొగిడినట్టా ? విమర్శించినట్టా ?

తనకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బీజేపీ నేత, దేవేంద్ర ఫడ్నవీస్ ను శివసేన అధినేత, నూతన సీఎం ఉధ్ధవ్ థాక్రే ఓ వైపు ప్రశంసలతో ముంచెత్తుతూనే మరోవైపు సున్నితంగా విమర్శల వర్షం కురిపించారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. తాను ఫడ్నవీస్ నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ‘ మీరు మాతో బాగా కలిసి ఉంటే.. బీజేపీ-శివసేనలో చీలిక వచ్చి ఉండేది కాదు ‘ అన్నారు. ఏమైనా.. మీరు మాకు మంచి స్నేహితులని, తను సదా […]

ఫడ్నవీస్ ను ఉధ్దవ్ పొగిడినట్టా ? విమర్శించినట్టా ?
Follow us

|

Updated on: Dec 01, 2019 | 6:05 PM

తనకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బీజేపీ నేత, దేవేంద్ర ఫడ్నవీస్ ను శివసేన అధినేత, నూతన సీఎం ఉధ్ధవ్ థాక్రే ఓ వైపు ప్రశంసలతో ముంచెత్తుతూనే మరోవైపు సున్నితంగా విమర్శల వర్షం కురిపించారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. తాను ఫడ్నవీస్ నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ‘ మీరు మాతో బాగా కలిసి ఉంటే.. బీజేపీ-శివసేనలో చీలిక వచ్చి ఉండేది కాదు ‘ అన్నారు. ఏమైనా.. మీరు మాకు మంచి స్నేహితులని, తను సదా మిత్రుడిగానే ఉంటానని ఉధ్ధవ్ చెప్పారు. సభలో ప్రతిపక్ష నేతగా ఫడ్నవీస్ ను నూతన స్పీకర్ నానా పటోలే ప్రకటించిన అనంతరం.. మాట్లాడిన ఉధ్ధవ్ థాక్రే.. తాను ఫడ్నవీస్ ను ప్రతిపక్ష నేతగా వ్యవహరించబోనని, బాధ్యతాయుతమైన నాయకునిగా భావిస్తానని పేర్కొన్నారు.’ విపక్ష నేతగా నేను ఫడ్నవీస్ ను ఆహ్వానిస్తున్నాను.. మేం గత 25 ఏళ్ళుగా కలిసి స్నేహితుల్లా ఉన్నాం.. ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు’ అన్నారాయన.. ఇప్పటికీ నేను హిందుత్వ సిధ్ధాంతాన్ని వదలిపెట్టలేదు.. గత ఐదేళ్లలో ప్రభుత్వానికి ద్రోహం చేయలేదు’ అని చెప్పారు.

కానీ గత శనివారం ఫడ్నవీస్ రహస్యంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. తనను ‘ లక్కీయెస్ట్ సీఎంగా ‘ ఉధ్ధవ్ అభివర్ణించుకున్నారు. గత 25.. 30 ఏళ్లుగా తనకు ప్రతిపక్షంగా ఉన్నవారు మిత్రులయ్యారని, నాడు మిత్రులుగా ఉన్నవారే ఇప్పుడు విపక్ష నేతలయ్యారని ఆయన పేర్కొన్నారు. . విపక్ష నేతలు కూడా నా ఫ్రెండ్స్ అన్నారాయన.