బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి ఆండ్రిలా శర్మ నవంబర్ 20న గుండెపోటు కారణంగా మరణించారు. ఆండ్రిలా వయసు కేవలం 24 సంవత్సరాలు. నవంబర్ 15న, ఆండ్రిలాకు పలుమార్లు గుండె ఆగిపోయిందని, ఆ తర్వాత ఆమెకు CPR కూడా చేశారు వైద్యులు. అయితే ఆ తర్వాత ఆమెకు అర్థరాత్రి మరో కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని, దాని కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆండ్రిలాకు చికిత్స చేసిన వైద్యులు వెల్లడించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 1 న ఆండ్రిలాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారు ఆమె కుటుంబ సభ్యులు. చాలా రోజులుగా ఆమె వెంటిలేటర్‌పై ఉంది. ఆండ్రిలా శర్మ కూడా క్యాన్సర్‌తో బయటపడింది. ఆమె రెండుసార్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని ఓడించి జయించింది.
నేటి కాలంలో, చిన్న వయస్సులోనే గుండె ఆగిపోయే ప్రమాదం పెరిగింది. చాలా సార్లు ప్రజలు కార్డియాక్ అరెస్ట్ లక్షణాలను పెద్ద పట్టించుకోవటం లేదంటున్నారు వైద్య నిపుణులు. ఇది సాధారణమైనదిగానే చూస్తున్నారు. మరి కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఏమిటి..? దానిని నివారించడానికి ఏ పద్ధతులు అవలంబించవచ్చు? ఇక్కడ తెలుసుకుందాం…
కార్డియాక్ అరెస్ట్ అనేది ప్రాణాంతక స్థితి. దీంతో గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. గుండె పనిచేయడం ఆపేస్తే.. అది రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. ఆ తర్వాత క్షణాల్లోనే దాని ప్రభావం మొత్తం శరీరంపై కనిపించడం మొదలవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR), డీఫిబ్రిలేషన్ కార్డియాక్ అరెస్ట్‌లో కొంతవరకు సహాయపడతాయి. CPR మీ ఊపిరితిత్తులలో తగినంత ఆక్సిజన్‌ను నిర్వహిస్తుంది. CPR, డీఫిబ్రిలేటర్ సమయానికి అందుబాటులో ఉంటే అప్పుడు గుండె ఆగిపోకుండా ప్రాణాలను రక్షించవచ్చు.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు..
– కార్డియాక్ అరెస్ట్ ముందు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి..
– కళ్లు తిరిగి స్పృహ కోల్పోతారు.
– గుండె వేగంగా కొట్టుకుంటుంది.
– ఛాతీ నొప్పి.
– తల తిరగడం.
– శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
– వాంతులు.
– కడుపు, ఛాతీ నొప్పి.
హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది? ..
కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటుకు భిన్నంగా ఉంటుంది. గుండెపోటులో రక్తం గుండెలోని ఒక భాగానికి చేరుకోవడం ఆగిపోతుంది. అయితే కార్డియాక్ అరెస్ట్‌లో గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. గుండెపోటు కొన్నిసార్లు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంది. కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఏర్పడి మూర్ఛ వస్తుంది. గుండె పని విధానంలో ఆటంకం కారణంగా ఇది జరుగుతుంది. దీని కారణంగా గుండె పంపింగ్ చర్యకు అంతరాయం కలిగిస్తుంది. శరీరంలో రక్త ప్రవాహం ఆగిపోతుంది.
కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటువంటి సంఘటనలు సాధారణంగా 35-40 సంవత్సరాల వయస్సులో కూడా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ వ్యాధి ముప్పు చాలా ఎక్కువైంది. అటువంటి పరిస్థితిలో ఈ క్రింద సూచించబడిన కారణాలు గుండె ఆగిపోవడానికి కారణమవుతాయి.
1. ధూమపానం
2. చెడు కొలెస్ట్రాల్
3. అధిక రక్తపోటు
4. మధుమేహం
5. మానసిక, సామాజిక ఒత్తిడి
6. పని చేయకపోవడం
7. ఊబకాయం
8. చాలా తక్కువ కూరగాయలు, పండ్లు తినడం
9. అధికంగా మద్యం సేవించడం
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి