బెజవాడకు కొత్త సమస్య..యువకుల్లో ‘ఆ’ శక్తి తగ్గుతోందట!

విజయవాడకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది… సమస్య బెజవాడకు కాదు కానీ అక్కడున్న యువకులది! యువకుల్లో కొందరికి జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది.. ఓ పట్టాన ఏదీ గుర్తుండటం లేదు.. గజనీ సినిమాలో అమీర్‌ఖాన్‌లా కొన్ని విషయాలను ఇట్టే మర్చిపోతున్నారు. వృద్ధాప్యంలోనే మతిమరుపు వస్తుందని అనుకుంటాం కానీ.. నిజానికి మతిమరుపు సమస్య టీనేజ్‌లోనే మొదలవుతుంది.. పాతికేళ్ల నుంచి 35 ఏళ్ల వయసువారిలో అది తీవ్రస్థాయికి చేరుతుంది.. అసలు తమకు మతిమరుపు అనే జబ్బు ఉందన్న విషయం కూడా చాలా మందికి […]

బెజవాడకు కొత్త సమస్య..యువకుల్లో ‘ఆ’ శక్తి తగ్గుతోందట!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 31, 2020 | 3:18 PM

విజయవాడకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది… సమస్య బెజవాడకు కాదు కానీ అక్కడున్న యువకులది! యువకుల్లో కొందరికి జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది.. ఓ పట్టాన ఏదీ గుర్తుండటం లేదు.. గజనీ సినిమాలో అమీర్‌ఖాన్‌లా కొన్ని విషయాలను ఇట్టే మర్చిపోతున్నారు. వృద్ధాప్యంలోనే మతిమరుపు వస్తుందని అనుకుంటాం కానీ.. నిజానికి మతిమరుపు సమస్య టీనేజ్‌లోనే మొదలవుతుంది.. పాతికేళ్ల నుంచి 35 ఏళ్ల వయసువారిలో అది తీవ్రస్థాయికి చేరుతుంది.. అసలు తమకు మతిమరుపు అనే జబ్బు ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.. పని ఒత్తిళ్లు.. ఉద్విగ్నత వంటివి జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.. ఆందోళనతో పనులు చేయడం వల్ల స్ట్రెస్‌ మరింత పెరుగుతుంది.. మనకు తెలియకుండానే అది మనసుపై ప్రభావం చూపుతుంది… ఇప్పుడు బెజవాడ యూత్‌ ఎదుర్కొంటున్న సమస్య ఇదే!

మునుపటిలా లేదిప్పటి తరం.. ఈ జనరేషన్‌ ఎదుట బోలెడంత టెక్నాలజీ… అరచేతిలో ఉన్న మొబైల్‌ఫోన్‌ సగం అనారోగ్యానికి కారణమవుతోంది.. సోషల్‌ మీడియాలోనో… వీడియో గేమ్స్‌ మోజులోనో పడి నిద్రకు దూరమవుతోంది యూత్‌.. సరిపడినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడు మందగించడం మొదలవుతుంది.. అదే మతిమరుపుకు కారణమవుతోంది.. పేరంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే గజనీలు పెరగడం ఖాయం.. మొన్నీమధ్య ఓ అమ్మాయి గతమంత మర్చిపోయి కేవలం తన పేరును మాత్రమే పలుకుతోంది.. ఇందుకు కారణం తల్లిదండ్రులు ప్రేమ విషయంపై నాలుగు చివాట్లు పెట్టారట! దాంతో ఆ అమ్మాయి డిప్రెషన్‌లోకి వెళ్లడం.. అది కాస్తా మతిమరుపుకు దారి తీయడం జరిగాయట! ఫుడ్‌ హాబిట్స్‌ కూడా మెదడుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. విటమిన్‌-బి 12 లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. రెడీమేడ్‌ఫుడ్‌కు.. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడిన యువతకు సమస్య తీవ్రత అర్థం కావడం లేదు..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.. చిన్నచిన్న లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్‌ను వాడటం మానేయాలి… ఫోన్‌నంబర్లను సెల్‌లో ఫీడ్‌ చేసుకోవడం మానేసి… అట్‌లీస్ట్‌ దగ్గర బంధువులు మిత్రుల నంబర్లనైనా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి.. టైమ్‌కు నిద్రపోవాలి.. ఒత్తిడిని జయించాలి.. పౌష్టికాహారం తీసుకోవాలి… అన్నింటికంటే ముఖ్యమైనది పేరంట్స్ పిల్లలపై ర్యాంకుల ఒత్తిడి పెట్టవద్దు…

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!