AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నా..ఈ చదువులు నా వల్ల కాదు..! స్టూడెంట్ సూసైడ్..

చదువే సక్సెస్‌కి కొలమానమా..? ఎంతమాత్రం కాదు. 10వ తరగతి పట్టా కూడా లేకుండా ప్రపంచాన్ని ఏలినవాళ్లు కోకొల్లలు. పేపర్ బాయ్ టూ ప్రెసిడెంట్ అయ్యారు అబ్దుల్ కలాం. ఆయన్ను మించిన ఇన్‌స్పైరర్ ఎవరుంటారు చెప్పండి. కానీ కొందరు పేరెంట్స్ మాత్రం చదువుతోనే అన్నీ సాధ్యమని నమ్మి..పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలు ఆ అంచనాలను అందుకోలేక..జీవితాల్ని చాలించుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి చదువు భారం మోయలేక ఓ స్టూడెంట్ తన లైఫ్‌ని ఎండ్ చేసుకోవడం పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది. గుంటూరు […]

నాన్నా..ఈ చదువులు నా వల్ల కాదు..! స్టూడెంట్ సూసైడ్..
Ram Naramaneni
|

Updated on: Jan 31, 2020 | 3:45 PM

Share

చదువే సక్సెస్‌కి కొలమానమా..? ఎంతమాత్రం కాదు. 10వ తరగతి పట్టా కూడా లేకుండా ప్రపంచాన్ని ఏలినవాళ్లు కోకొల్లలు. పేపర్ బాయ్ టూ ప్రెసిడెంట్ అయ్యారు అబ్దుల్ కలాం. ఆయన్ను మించిన ఇన్‌స్పైరర్ ఎవరుంటారు చెప్పండి. కానీ కొందరు పేరెంట్స్ మాత్రం చదువుతోనే అన్నీ సాధ్యమని నమ్మి..పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలు ఆ అంచనాలను అందుకోలేక..జీవితాల్ని చాలించుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి చదువు భారం మోయలేక ఓ స్టూడెంట్ తన లైఫ్‌ని ఎండ్ చేసుకోవడం పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది.

గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన మోహనరెడ్డిది వ్యవసాయ కుటుంబం. తన బిడ్డ తనలాగా కాయకష్టం చేయడం ఇష్టం లేని తండ్రి చిన్నప్పటి నుంచి తన సంపాదించింది అంతా కొడుకు మోహనరెడ్డి చదువుకే ఖర్చుపెట్టాడు. 2017లో ఇక్కడ గ్రాడ్యువేషన్ పూర్తికాగానే ఎంఎస్ చదివేందుకు కొడుకు జర్మనీ పంపించాడు. ఆ దేశంలోని అత్యన్నతమైన డస్​బర్గ్-ఈస్సెన్ యూనివర్సిటీ జాయిన్ చేయించాడు. ఈ ఇయర్‌తో అతని కోర్స్ పూర్తవ్వబోతోంది. కానీ బ్యాగ్ లాగ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఇంత కష్టపడి పెంచి, చదివించిన తండ్రికి ఈ చదువులు తన వల్ల కావని ఆ కుర్రాడు చెప్పలేకపోయాడు. ఓ నాలుగు రోజులు క్రితం ఇంటికి ఫోన్ చేసి..చదువుపై సరిగ్గా ధ్యాస ఉండటం లేదని చెప్పాడు. తల్లిదండ్రులు కొడుక్కి.. ఏం పర్లేదని సర్ది చెప్పారు. అయితే మరింత ఒత్తిడికి లోనైన మోహనరెడ్డి ఈ బుధవారం అతడు నివశిస్తున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా కొడుకు మరణవార్తను విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కాగా మోహనరెడ్డి మృతిదేహం ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ తప్పు ఎవరిదనేది కాదు..ఎక్కడ తప్పు జరిగిందనేది పేరెంట్స్‌తో పాటు వారి పిల్లలు కూడా ఆలోచించాలి. అప్పుడే ఈ ఆత్మహత్యలకు ఓ సమాధానం దొరకుతుంది.