Beauty Tips: ఆయుర్వేదంతో సహజ సౌందర్యం.. వేప, పసుపు, కలబంద, చందనం వీటితో..

వర్షా కాలంలో మొటిమలు, ఇతర సమస్యలు తలెత్తుతాయి. ముఖ సౌందర్యానికి, చర్మ ఆరోగ్యానికి ఆయుర్వేద చర్మ సంరక్షణ చిట్కాలు చక్కని ఫలితాలను ఇస్తాయని మీకు తెలుసా! కొన్ని మీకోసం.. 

Beauty Tips: ఆయుర్వేదంతో సహజ సౌందర్యం.. వేప, పసుపు, కలబంద, చందనం వీటితో..
Ayurvedic Skin Care
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2022 | 12:30 PM

Ayurvedic Skincare Tips: వర్షాకాలం ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించినా.. వాతావరణంలో మార్పు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చర్మం నుంచి అదనపు నూనె రావడం ప్రారంభమవుతుంది. ఈ నూనె చర్మంపై దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. ఫలితంగా రంధ్రాలు మూసుకుపోతాయి. ఆ తర్వాత మొటిమలు, ఇతర సమస్యలు తలెత్తుతాయి. ముఖ సౌందర్యానికి, చర్మ ఆరోగ్యానికి ఆయుర్వేద చర్మ సంరక్షణ చిట్కాలు చక్కని ఫలితాలను ఇస్తాయని మీకు తెలుసా! కొన్ని మీకోసం..

తగినన్ని నీరు తాగాలి ఈ సీజన్‌లో విపరీతమైన చెమట వల్ల చాలా నీరు పోతుంది. దీంతో నిర్జలీకరణం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తగినంత నీటిని తాగడం చాలా అవసరం. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. దుంపలు, క్యారెట్, దోసకాయ, గోధుమ గడ్డితో తయారు చేసిన పానీయాలు తాగాలి. ఇవి మిమ్మల్నిరోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరం నుంచి హానికారక టాక్సిన్లను బయటకు పంపడంలో కూడా సహాయపడతాయి.

పుల్లని ఆహారాలు వర్షాకాలంలో పుల్లని ఆహారాలు తీసుకోవడం తగ్గించాలి. పెరుగు, చింతపండు, సిట్రస్ పండ్లు, వెనిగర్ తీసుకోవడం మానుకుంటే మంచిది. పులియబెట్టిన ఆహారం, ఉప్పు, మసాలా ఆహారం శరీరంలో కఫాన్ని పెంచుతుంది. అంతేకాకుండా చర్మంపై మొటిమలు, దురద, తామర వంటి సమస్యలు తలెత్తుతాయి.

హెర్బల్ ఫేస్ ప్యాక్‌.. వర్షాకాలంలో చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా ఆయుర్వేద ఫేస్‌ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. పసుపు, కలబంద, చందనం, వేపతో చేసిన హెర్బల్ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఇది చర్మంలోని మచ్చలను తొలగించి, తాజాగా ఉంచుతుంది.

మూలికా నూనె మసాజ్ వర్షాకాలంలో తేమ కారణంగా ఇన్ఫెక్షన్‌ త్వరగా వస్తుంది. వేప, పసుపు వంటి మూలికా నూనెలతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు. ప్రతి రోజూ స్నానానికి ముందు ఈ నూనెలను మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?