అనుష్క.. త్వరగా పెళ్లి చేసుకోవాః ప్రభాస్

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంత చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ నెల 30న ‘సాహో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ ప్రభాస్‌ను అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి అడగ్గా..  ‘ నాకూ లేదా అనుష్కకు.. ఎవరికో […]

అనుష్క.. త్వరగా పెళ్లి చేసుకోవాః ప్రభాస్
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 21, 2019 | 8:04 PM

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంత చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ నెల 30న ‘సాహో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ ప్రభాస్‌ను అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి అడగ్గా..  ‘ నాకూ లేదా అనుష్కకు.. ఎవరికో ఒకరికి పెళ్లి అయితే తప్ప ఈ వదంతులు ఆగవు’ అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు అనుష్కను ఈసారి కలిసినప్పుడు ‘త్వరగా పెళ్లి చేసుకోమని చెబుతా అంటూ సరదాగా అన్నాడు. ఒకవేళ మేం రిలేషన్‌షిప్‌లో ఉంటే  ఎక్కడో చోట తిరిగేవాళ్ళమే కదా.? ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడతాం అని ప్రభాస్ తెలిపాడు.