ట్వీట్ తెచ్చిన తంటా.. ప్రియాంక పై పాక్ ఫిర్యాదు..

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. ప్రియాంక చోప్రాను యునిసెఫ్ అంబాసిడర్‌గా తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. యునిసెఫ్​ అంబాసిడర్​గా ఉన్న ఆమె… శాంతి స్థాపనకు కృషి చేయడంలో విఫలమైనట్లు తెలిపింది. ఆర్టికల్​ 370 రద్దుకు మద్దతివ్వడమే కాకుండా పాకిస్థాన్​పై అణు యుద్ధాన్ని సమర్థిస్తూ ట్వీట్​ చేసిందని ప్రియాంక పై పాక్ ఫిర్యాదు చేసింది. Jai Hind #IndianArmedForces ?? ?? — PRIYANKA (@priyankachopra) February 26, 2019 Sent letter to […]

ట్వీట్ తెచ్చిన తంటా.. ప్రియాంక పై పాక్ ఫిర్యాదు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2019 | 7:11 PM

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. ప్రియాంక చోప్రాను యునిసెఫ్ అంబాసిడర్‌గా తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. యునిసెఫ్​ అంబాసిడర్​గా ఉన్న ఆమె… శాంతి స్థాపనకు కృషి చేయడంలో విఫలమైనట్లు తెలిపింది. ఆర్టికల్​ 370 రద్దుకు మద్దతివ్వడమే కాకుండా పాకిస్థాన్​పై అణు యుద్ధాన్ని సమర్థిస్తూ ట్వీట్​ చేసిందని ప్రియాంక పై పాక్ ఫిర్యాదు చేసింది.

అర్టికల్ 370 రద్దు తర్వాత అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో బ్యూటీ కాన్ పేరిట నిర్వహించిన ఒక షోలో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. పలువురు సెలబ్రెటీలు హాజరైన ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన అయేషా అనే యువతి కశ్మీర్ పరిణామాలు, సర్జికల్ స్టైక్ విషయంలో ప్రియాంక పై ప్రశ్నలు కురిపించింది. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల సందర్భంగా ప్రియాంక జైహింద్ అని ట్వీట్ చేయడాన్ని ఆమె తప్పుబడుతూ.. యూనిసెస్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న మీరు ఇలాంటి రెచ్చగొట్టే ట్వీట్లు చేయవచ్చా అని ప్రశ్నించింది. అయేషా ఆరోపణలకు ప్రియాంక ధీటుగా సమాధానమిచ్చింది. తాను భారతీయురాలినని దేశమంటే తనకు గౌరవం, బాధ్యత ఉన్నాయని స్పష్టం చేసింది. ఊరికే అరిచి పరువు తీసుకోవద్దని హెచ్చరించారు.

మనం ఒకరికొకరు అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రియాంక చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని.. ఉన్నత స్థానాలను చేరుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యాక్తం చేశారు. అంతేకాదు వీలైనంత మందికి సహాయం చేస్తానని ప్రియాంక స్పష్టం చేశారు.