AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాములమ్మపై కుట్ర.. కారణం ఆ ఇద్దరేనా.?

రాములమ్మ పార్టీ మారబోతున్నారా? బీజేపీ వైపు చూస్తున్నారా..?త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారా.. లేదంటే ఇలా రూమర్లను క్రియేట్ చేశారా? గాంధీభవన్ వేదికగా రాములమ్మపై కుట్ర చేస్తున్నారా? రాములమ్మపై అసత్య ప్రచారాలు చేస్తే ఆ నేతలకొచ్చే లాభమేంటి? దీనిపై విజయశాంతి ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. బీజేపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన విజయశాంతికి ఆ పార్టీ నేతలతో పరిచయాలున్నాయి.తెలంగాణ బలపడాలని కలలుగంటున్న ఆ పార్టీ కాంగ్రెస్ కీలక […]

రాములమ్మపై కుట్ర.. కారణం ఆ ఇద్దరేనా.?
Ravi Kiran
|

Updated on: Aug 21, 2019 | 8:13 PM

Share

రాములమ్మ పార్టీ మారబోతున్నారా? బీజేపీ వైపు చూస్తున్నారా..?త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారా.. లేదంటే ఇలా రూమర్లను క్రియేట్ చేశారా? గాంధీభవన్ వేదికగా రాములమ్మపై కుట్ర చేస్తున్నారా? రాములమ్మపై అసత్య ప్రచారాలు చేస్తే ఆ నేతలకొచ్చే లాభమేంటి? దీనిపై విజయశాంతి ఏమంటున్నారు?

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. బీజేపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన విజయశాంతికి ఆ పార్టీ నేతలతో పరిచయాలున్నాయి.తెలంగాణ బలపడాలని కలలుగంటున్న ఆ పార్టీ కాంగ్రెస్ కీలక నేతలకు వలలు వేస్తుందని ప్రచారం నడుస్తోంది.ఇందులో భాగంగా రాములమ్మ బీజేపీలోకి రీఎంట్రీ ఇస్తారని ఓ వార్త వైరల్ అయింది. ఈ ప్రచారంపై స్పందించిన విజయశాంతి పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తాను పార్టీ మారబోతున్నానంటూ కొందరు కావాలనే కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయం గాంధీభవన్ నుంచే కుట్ర చేస్తున్నారని కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంపై టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు ఆమె ఆ ప్రకటనలో తెలిపారు. పార్టీ మార్పుపై హడావుడిగా నిర్ణయం తీసుకోబోనంటూ స్పష్టం చేశారు. అలాగే పార్టీ మారే ఆలోచన ఉంటే బహిరంగంగానే ప్రకటిస్తానని చెప్పారు. తను పార్టీ మారబోతున్నాననే ప్రచారం వెనుక ఇద్దరు నేతలు ఉన్నారని విజయశాంతి తన సన్నిహితులతో వాపోయారు. అయితే గాంధీ భవన్ కుట్రను త్వరలోనే బయట పెడతానంటూ విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.

శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..