‘రండి..సమోసాలు తిందాం’.. మోదీకి ఆస్ట్రేలియా పీఎం ఆహ్వానం

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సరదాగా ఉంటారట.. బహుశా అందుకే ఆయన సమోసాల ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ.. భారత ప్రధాని మోదీతో కలిసి వీటిని షేర్ చేసుకోవాలని ఉందన్నారు. (ఇద్దరు ప్రధానులూ జూన్ 4 న వీడియో మీట్ ద్వారా కలుసుకోనున్నారు మరి!) ‘సన్ డే సమోసా ! విత్ మ్యాంగో చట్నీ.. అన్నీ స్క్రాచ్ నుంచి చేసినవే.. ఈ వారం వీడియో లింక్ ద్వారా మోదీని కలుస్తున్నాను. వాళ్ళు (ఆయన) వెజిటేరియన్స్ […]

  • Umakanth Rao
  • Publish Date - 6:10 pm, Sun, 31 May 20
'రండి..సమోసాలు తిందాం'.. మోదీకి ఆస్ట్రేలియా పీఎం ఆహ్వానం

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సరదాగా ఉంటారట.. బహుశా అందుకే ఆయన సమోసాల ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ.. భారత ప్రధాని మోదీతో కలిసి వీటిని షేర్ చేసుకోవాలని ఉందన్నారు. (ఇద్దరు ప్రధానులూ జూన్ 4 న వీడియో మీట్ ద్వారా కలుసుకోనున్నారు మరి!) ‘సన్ డే సమోసా ! విత్ మ్యాంగో చట్నీ.. అన్నీ స్క్రాచ్ నుంచి చేసినవే.. ఈ వారం వీడియో లింక్ ద్వారా మోదీని కలుస్తున్నాను. వాళ్ళు (ఆయన) వెజిటేరియన్స్ కదా ! అందుకే వీటిని ఆయనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను’ అని అన్నారు.

ఇందుకు మోదీ కూడా ఆయనకు రిప్లయ్ ఇస్తూ.. మీ సెంటిమెంటును ప్రశంసిస్తున్నానని, కరోనా వైరస్ ను ‘ఓడించిన తరువాత’ మనం కలిసి సమోసాలు తినడాన్ని ఎంజాయ్ చేద్దామని ట్వీట్ చేశారు. నాలుగో తేదీన మన వీడియో మీట్ కోసం ఎదురు చూస్తున్నా అని కూడా మోదీ పేర్కొన్నారు.