కేజీ మిడతలు పట్టి తెస్తే 20 రూపాయ‌లు…!

కరోనాతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న వేళ‌.. మిడతల దండు ఇప్పుడు కొన్ని దేశాల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అవి పంట‌ల మొత్తాన్ని నామ‌రూపాలు లేకుండా తినేస్తుండ‌టంతో ప్ర‌భుత్వాల‌కు ఏం చెయ్యాల‌నే పాలుపోవ‌డం లేదు. తాజాగా ఈ సమస్యకు పాకిస్తాన్ అదిరిపోయే సొల్యూషన్ తో ముందుకొచ్చింది. స్ప్రేలు, పురుగు మందులు, జెట్టింగ్ మిషన్లకు భారీగా ఖ‌ర్చు పెట్ట‌కుండా.. సమస్యను పరిష్కరించేందుకు వినూత్న‌మైన ప్ర‌ణాళిక సిద్దం చేసింది. “క్యాచ్ లోకస్ట్స్, ఎర్న్ మనీ, సేవ్ క్రాప్స్” పేరుతో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:06 pm, Sun, 31 May 20
కేజీ మిడతలు పట్టి తెస్తే 20 రూపాయ‌లు...!

కరోనాతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న వేళ‌.. మిడతల దండు ఇప్పుడు కొన్ని దేశాల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అవి పంట‌ల మొత్తాన్ని నామ‌రూపాలు లేకుండా తినేస్తుండ‌టంతో ప్ర‌భుత్వాల‌కు ఏం చెయ్యాల‌నే పాలుపోవ‌డం లేదు. తాజాగా ఈ సమస్యకు పాకిస్తాన్ అదిరిపోయే సొల్యూషన్ తో ముందుకొచ్చింది. స్ప్రేలు, పురుగు మందులు, జెట్టింగ్ మిషన్లకు భారీగా ఖ‌ర్చు పెట్ట‌కుండా.. సమస్యను పరిష్కరించేందుకు వినూత్న‌మైన ప్ర‌ణాళిక సిద్దం చేసింది. “క్యాచ్ లోకస్ట్స్, ఎర్న్ మనీ, సేవ్ క్రాప్స్” పేరుతో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మిడతలను అరిక‌ట్టే బాధ్యత ప్ర‌జ‌ల‌కు అప్ప‌జెప్పి, వారికి దీనిని ఉపాధి మార్గంగా మార్చింది. కేజీ మిడతలు పట్టి తెస్తే రూ.20 ఇస్తామని అనౌన్స్ చేసింది. ఓకరా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించారు. మొదటి రోజు జ‌నం ఈ ఆఫ‌ర్ పై ఇంట్ర‌స్ట్ చూప‌లేదు. కానీ తర్వాతి రోజు నుంచి వంద‌ల సంఖ్య‌లో జ‌నం మిడతలపై రివ‌ర్స్ దండ‌యాత్ర‌ మొదలెట్టారు. ఒక్క రాత్రిలోనే దాదాపు 7 టన్నుల మిడతలను పట్టడంతో అధికారులు స‌ర్ఫ్రైజ్ అయ్యారు.

మ‌రి ప్ర‌భుత్వం మిడ‌త‌ల‌ను ఏం చేస్తోంది…

కొన్న మిడతలను ప్రభుత్వం ఏం చేస్తుందనే కదా మీ డౌట్?.. దానికి కూడా వాళ్ల‌ద‌గ్గ‌ర ఓ మంచి ఐడియా ఉంది. కోళ్లకు, చేపలకు వేసే మాములుగా వేసే దాణా కన్నా.. మిడతలతో చేసిన దాణాలో ఎక్కువ‌ ప్రోటీన్ ఉంటుందంట. పాకిస్థాన్ లోని ఓ పెద్ద‌ పౌల్ట్రీ ఫీడ్స్ కంపెనీ 5 వారాల పాటు స్టడీ చేసి ఈ విషయాన్ని వెల్ల‌డించింది.