బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. ఏటీఎం విత్‌డ్రా మరింత ప్రియం..!
క్యాష్ విత్‌డ్రాపై వినియోగదారులు చెల్లించే ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్‌బీఐ పెంచిన నేపథ్యంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని.. దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్లు లేఖలో పేర్కొన్నారు. ఐదు ఉచిత లావాదేవీల తరువాత ప్రస్తుత ఇంటర్‌ఛేంజ్ ఫీజును ప్రతి […]
క్యాష్ విత్‌డ్రాపై వినియోగదారులు చెల్లించే ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్‌బీఐ పెంచిన నేపథ్యంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని.. దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్లు లేఖలో పేర్కొన్నారు.
ఐదు ఉచిత లావాదేవీల తరువాత ప్రస్తుత ఇంటర్‌ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి రూ .15 చొప్పున వినియోగదారునికి విధించారు. నగదు రహిత ట్రాన్సాక్షన్‌ల(బ్యాలెన్స్ ఎంక్వైరీ)పై రూ. 5 చొప్పున ఈ ఛార్జీలు ఉన్నాయి. దేశంలో ఎటిఎంలను పెంచే మార్గాలను సిఫారసు చేయడానికి 2019 లో ఆర్‌బిఐ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యుల కమిటీ ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాలని, జనాభా 1 మిలియన్ కంటే ఎక్కువ ఉన్న పట్టణ ప్రాంతాలకు నగదు లావాదేవీలపై రూ .17, ఆర్థికేతర లావాదేవీలపై రూ .7 ఇంటర్‌ఛేంజ్ ఫీజును సిఫారసు చేసింది. ఉచిత ఎటిఎం లావాదేవీలను మూడింటికి పరిమితం చేయాలని సూచించింది.
జనాభా 1 మిలియన్ కంటే తక్కువ ఉన్న గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు, నగదు లావాదేవీలపై రూ .18, ఆర్థికేతర లావాదేవీలకు రూ .8 ఇంటర్‌ఛేంజ్ ఫీజును కమిటీ సిఫార్సు చేసింది, ఉచిత ఎటిఎం లావాదేవీలను ఆరు వరకు పరిమితం చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను కేంద్ర బ్యాంక్ పరిశీలిస్తోంది. దీనిపై ఆర్‌బీఐ ఏటీఎం ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఖాతాదారుడిపై అదనపు భారం తప్పదు.