హెచ్‌సీఏ‌లో విభేదాలు నిజమే..కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందంటున్న అసోసియేషన్ సెక్రెటరీ విజయ్‌ ఆనంద్

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో విభేదాలు నిజమేనన్నారు సెక్రెటరీ విజయ్‌ ఆనంద్‌. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందన్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో చిన్న చిన్న విభేదాలు ఉండడం సహజమన్న విజయ్‌ ఆనంద్‌.. త్వరలోనే వాటిని పరిష్కరించుకుంటామన్నారు.

హెచ్‌సీఏ‌లో విభేదాలు నిజమే..కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందంటున్న అసోసియేషన్ సెక్రెటరీ విజయ్‌ ఆనంద్
Follow us

|

Updated on: Dec 15, 2020 | 9:40 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో విభేదాలు నిజమేనన్నారు సెక్రెటరీ విజయ్‌ ఆనంద్‌. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందన్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో చిన్న చిన్న విభేదాలు ఉండడం సహజమన్న విజయ్‌ ఆనంద్‌.. త్వరలోనే వాటిని పరిష్కరించుకుంటామన్నారు.

హెచ్‌సీఏ గత చరిత్రను నిలబెట్టేలా చూస్తామన్నారు సెక్రెటరీ విజయ్‌ ఆనంద్‌. అజారుద్దీన్‌ ఆధ్వర్యంలో మెరికల్లాంటి క్రికెటర్లను వెలికితీస్తామన్నారు. కార్పోరేట్‌ మాఫియాను అరికట్టేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌లో విజిలెన్స్‌ టీంను పెట్టామన్నారు. ఏజీఎం మీటింగ్‌ జరిగితే తప్ప ఫండ్స్‌ వచ్చే అవకాశం లేదన్నారు. దాని కోసమే పర్మిషన్‌ కోసం అప్లై చేస్తే.. తప్పుడు సంకేతం వెళ్లిందన్నారు. గత నవంబర్‌ 27నే ఏజీఎం మీటింగ్‌ జరపాలని అపెక్స్‌ కౌన్సిల్‌లోనే నిర్ణయం తీసుకున్నామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కారణంగా అది వాయిదా పడడంతో.. మరోమారు నిర్వహించేందుకే పర్మిషన్‌ కోరాను తప్ప మరో ఉద్దేశం లేదన్నారు.

ఏజీఎం మీటింగ్‌ జరిగితే తప్ప డబ్బులు వచ్చే అవకాశం లేదన్నారు విజయ్‌ఆనంద్‌. రెండేళ్లుగా అకౌంట్స్‌ పెండింగ్‌లో ఉన్నందున… ఏజీఎం మీటింగ్‌ నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నామన్నారు. జిల్లాల నుంచి ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీసేందుకు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లను కూడా నియమించామన్నారు. ఏది ఏమైనా కలిసికట్టుగానే ముందుకు సాగుతామని, త్వరలోనే తాము సమావేశమై.. కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌ను కూడా ప్రకటిస్తామన్నారు ఆనంద్‌.