అక్రమ చొరబాటుదారులు మీ చుట్టాలా..? కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం

ఎన్నికల ప్రచారం వస్తే చాలు.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వార్.. తారా స్థాయికి చేరుకుటుంది. అదే సీన్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతోంది. అధికార బీజేపీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్టికల్ 370 రద్దు అంశం. ఎన్సార్సీ అంశాలనే మరోసారి లేవనెత్తుతూ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురుగ్రామ్‌లో బుధవారం జరిగిన ప్రచారంలో కేంద్ర […]

అక్రమ చొరబాటుదారులు మీ చుట్టాలా..? కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2019 | 2:02 AM

ఎన్నికల ప్రచారం వస్తే చాలు.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వార్.. తారా స్థాయికి చేరుకుటుంది. అదే సీన్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతోంది. అధికార బీజేపీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్టికల్ 370 రద్దు అంశం. ఎన్సార్సీ అంశాలనే మరోసారి లేవనెత్తుతూ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురుగ్రామ్‌లో బుధవారం జరిగిన ప్రచారంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో అక్రమ చొరబాటుదారులను వెల్లగొడతామంటే కాంగ్రెస్‌ ఎందుకు ఉలిక్కిపడుతోందని అన్నారు. ఎన్నార్సీ అంశం లేవనెత్తినప్పుడల్లా కాంగ్రెస్ స్పందిస్తుందని.. వారిని ఎందుకు పంపించేస్తారంటూ ప్రశ్నిస్తోందని అన్నారు. వాళ్లు ఎక్కడికి వెళ్తారు.. ఏం తింటారంటూ అడుగుతోందని.. అసలు వాళ్లేమైనా వీరి చుట్టాలా అంటూ విమర్శించారు. 2024 నాటికి దేశం నుంచి ప్రతి అక్రమ చొరబాటుదారున్ని దేశం నుంచి పంపించేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హర్యానా మాజీ సీఎం భూపిందర్ హుడా లాంటివారు అభ్యంతరం చెప్పినప్పటికీ.. దేశం నుంచి 2024నాటికి అక్రమ వలసదారులను పంపించడం ఖాయమన్నారు.