అయ్యో.. ఏంటి దీదీ.. మీరు ఇలా!

అయ్యో.. ఏంటి దీదీ.. మీరు ఇలా!

ప్రతిష్టాత్మక వ్యక్తుల పేర్లు తప్పుగా చదివితే నలుగురిలో నవ్వుల పాలు కావాల్సిందే. ఇక అదే రాజకీయ నాయకులు తప్పు చదివితే.. ఇంకేమైనా ఉంటుందా.. ప్రతిపక్షాలు, నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. అలాంటి ఘటనే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురైంది. తెలిసే అన్నారో.. లేక తెలియక అన్నారో కానీ.. దీదీ నోరు జారారు. అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అభిజిత్ బెనర్జీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనే పేరునే తప్పుగా పలికారు. అభిజిత్‌.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 17, 2019 | 1:21 AM

ప్రతిష్టాత్మక వ్యక్తుల పేర్లు తప్పుగా చదివితే నలుగురిలో నవ్వుల పాలు కావాల్సిందే. ఇక అదే రాజకీయ నాయకులు తప్పు చదివితే.. ఇంకేమైనా ఉంటుందా.. ప్రతిపక్షాలు, నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. అలాంటి ఘటనే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురైంది. తెలిసే అన్నారో.. లేక తెలియక అన్నారో కానీ.. దీదీ నోరు జారారు. అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అభిజిత్ బెనర్జీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనే పేరునే తప్పుగా పలికారు. అభిజిత్‌.. అయితే “అభిషేక్ బాబు” అంటూ ఒక్కసారి కాదు.. పలుమార్లు అన్నారు.

బెంగాల్‌ నుంచి అమర్త్యసేన్‌‌, మదర్‌థెరీసా నోబెల్‌ పురస్కారం అందుకున్నారని.. తాజాగా అభిషేక్‌ బాబును నోబెల్‌ బహుమతి వరించిందని మమతా బెనర్జీ అన్నారు. ఇది బెంగాల్‌కు గర్వకారణమని.. అభిషేక్‌ బాబు తల్లి కోల్‌కతాలోనే ఉంటారని.. నేను ఆమెను కలవడానికి వెళ్తున్నానంటూ తెలిపారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి చేపట్టబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ దాదాపై దీదీ ప్రశంసలు కురిపించారు. గంగూలీ తమ కుటుంబ సభ్యుడి లాంటి వాడంటూ పేర్కొన్నారు. అయితే మమతా బెనర్జీ మేనల్లుడి పేరు అభిషేక్‌. అయితే ఏదో ధ్యాసలో ఉంటూ.. అభిజిత్ బదులు అభిషేక్ అని ఉంటారంటూ సన్నిహితులు గుసగుసలాడుతుంటే.. సీఎం హోదాలో ఉండి.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న వ్యక్తి పదేపదే తప్పుగా పలుకడం ఏంటంటూ పలువురు మండిపడుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu