ఏపీఎస్ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం : కార్మికుల‌కు రూ.50 ల‌క్ష‌ల కోవిడ్ బీమా వ‌ర్తింపు

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు కోవిడ్ బీమా వర్తింపజేయాలని నిర్ణ‌యించింది. ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల చొప్పున కోవిడ్ బీమా వర్తింప జేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీఎస్ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం :  కార్మికుల‌కు రూ.50 ల‌క్ష‌ల కోవిడ్ బీమా వ‌ర్తింపు
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2020 | 5:32 PM

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు కోవిడ్ బీమా వర్తింపజేయాలని నిర్ణ‌యించింది. ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల చొప్పున కోవిడ్ బీమా వర్తింప జేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్మిక పరిషత్ సహా కార్మికుల వినతిపై స్పందించి ఆర్టీసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదే విష‌యంపై ఆర్టీసీ ఎండీ కృష్ణబాబునుని కలసి నిన్న వినతి పత్రం అందించారు కార్మిక పరిషత్ నేతలు. ఈ క్ర‌మంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింప జేస్తున్న‌ట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఆర్టీసీలో కరోనాతో ఇప్పటి వరకు 36 మంది మరణించిన నేప‌థ్యంలో..వారంద‌రికీ బీమా వర్తింపజేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. మృతుల వివరాలు సహా తగిన డాక్యుమెంట్స్‌ పంపాలని అన్ని జిల్లాల రీజ‌న‌ల్ మేనేజ‌ర్స్‌కు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 లోపు అన్ని డాక్యుమెంట్స్‌ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎండీ ఆదేశించారు.

Also Read :

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి

జగ్గయ్యపేటలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న కానిస్టేబుళ్లు అరెస్ట్