Apple Airpods: మీకు బంగారంతో తయారు చేసిన హెడ్‌ఫోన్స్ కావాలా.. అయితే ముందుగా బుక్ చేసుకోండి..
Apple Airpods: ప్రముఖ దిగ్గజ కంపెనీ యాపిల్ సంస్థ ‘ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్’ పేరుతో తొలిసారిగా హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల

Apple Airpods: ప్రముఖ దిగ్గజ కంపెనీ యాపిల్ సంస్థ ‘ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్’ పేరుతో తొలిసారిగా హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.59 వేలుగా ఉంది. అదే సిరీస్‌లో ఇప్పుడు ప్యూర్ గోల్డ్‌తో తయారైన ఎయిర్ పోడ్స్ మ్యాక్స్‌ను సిద్ధం చేస్తోంది. దీని ధరను రూ. రూ.79,25,245 నిర్ణయించారు. ప్రముఖ రష్యన్ కంపెనీ కేవియర్ ప్రముఖ బ్రాండ్లకు చెందిన గాడ్జెట్స్‌ను లగ్జరీ ఐటమ్స్‌గా రూపొందిస్తుంటుంది. అంతేకాదు బంగారంతో తయారుచేసే ఈ ఐటమ్స్‌లో వజ్రాలను పొదిగి మరీ డిజైన్ చేస్తుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ హెడ్‌ఫోన్స్‌ను బంగారంతో తయారుచేసి అందించేందుకు సిద్ధమైంది. కేవియర్ గ్లోబల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఎయిర్‌పోడ్స్ గోల్డ్ వైట్, గోల్డ్ బ్లాక్ రంగుల్లో లభించనున్నాయి. ఈ రెండింటినీ కూడా 750 గోల్డ్ (ప్యూర్ గోల్డ్)తో పాటు క్రొకడైల్ లెదర్ ఉపయోగించి రూపొందించగా, వీటిని 2021లో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వీటిని దక్కించుకోవాలంటే మాత్రం డబ్బులుంటే సరిపోదు, అదృష్టం కూడా కావాలి. ఎందుకంటే.. కంపెనీ కేవలం రెండు యూనిట్లను మాత్రమే రూపొందిస్తోంది. ఈ రెండు ఫోన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ అభిమానులు ఎదురుచూస్తుండగా.. కేవియర్‌లో వీటిని ఎప్పుడు సేల్‌కు పెడతారో, అప్పుడు ముందుగా బుక్ చేసుకున్న వారికే దక్కుతాయి.



