రాజకీయ లబ్దికోసం ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు, దివిస్ పై పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు స్పందించలేదన్న మంత్రి

తూర్పుగోదావరిజిల్లా తునిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ..

రాజకీయ లబ్దికోసం ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు, దివిస్ పై పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు స్పందించలేదన్న మంత్రి
Mekapati Goutham Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 10, 2021 | 3:47 PM

తూర్పుగోదావరిజిల్లా తునిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్దికోసం ప్రజలను రెచ్చకొట్టడం సరైంది కాదన్న ఆయన, భూములిచ్చిన వారికి, స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. దివిస్ వైసీపీ హయాంలో మొదలైంది కాదన్న మేకపాటి, 2018 లో ఈ వ్యవహారం మొదలైందన్న విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని అన్నారు. ఆరోజు టీడీపీతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు అప్పుడు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు.