ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల.. ఆ సెలవులు రద్దు..
జూనియర్ కాలేజీలకు సంబంధించిన 2020-21 అకడమిక్ క్యాలెండర్‌ను ఏపీ ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో చివరి..

Inter Academic Calendar: జూనియర్ కాలేజీలకు సంబంధించిన 2020-21 అకడమిక్ క్యాలెండర్‌ను ఏపీ ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో చివరి పనిదినం 2021 ఏప్రిల్ 24 కాగా.. మొత్తం 127 రోజులు కళాశాలలు పని చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
అలాగే జూన్ చివరి వారం నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక రెండో శనివారం సెలవులు ఉంటాయన్న ఇంటర్ బోర్డు.. టర్మ్ సెలవులను మాత్రం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, జూన్ 1 నుంచి 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
Also Read: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ మరో కొత్త పధకానికి శ్రీకారం..
