AP Sachivalayam: సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజున ‘సచివాలయ దినోత్సవం’.. సచివాలయాల ఉద్యోగ సంఘం తీర్మానం..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు(డిసెంబర్ 21) నాడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ మేరకు...
AP Sachivalayam: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు(డిసెంబర్ 21) నాడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంట్రామిరెడ్డి కీలక ప్రకటన చేశారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సుమారు 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం అసాధారణ విషయమన్న ఆయన.. అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. కాగా, ఏపీ సీఎం జగన్ 2019 అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Also Read:
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..
బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..