బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం(డిసెంబర్ 20) జరగనుంది. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు.

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!
Follow us

|

Updated on: Dec 14, 2020 | 6:40 AM

Bigg Boss 4: అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం(డిసెంబర్ 20) జరగనుంది. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు. అయితే దాని కంటే ముందే వికీపీడియా అభిజిత్ విజేతగా గెలిచేశాడని తేల్చేసింది. అంతేకాదు రన్నరప్‌ సోహైల్‌, మూడో స్థానంలో అఖిల్, నాలుగో స్థానంలో హారిక.. ఇక చివరి స్థానంలో అరియానా నిలిచినట్లు ప్రకటించింది.

ప్రస్తుతం మిస్‌డ్ కాల్స్, హాట్‌స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. సోమవారం(డిసెంబర్ 14) మొదలై.. శుక్రవారం(డిసెంబర్ 18) అర్ధరాత్రితో ముగిస్తుంది. ఇదంతా పూర్తయిన తర్వాతే షో నిర్వాహకులకు విన్నర్ ఎవరనేది తెలుస్తుంది. ఇక డిసెంబర్ 20వ తేదీ ఫినాలే ఎపిసోడ్‌లో ప్రత్యేక అతిధి విచ్చేసి విజేతను ప్రకటిస్తారు.

ఇదిలా ఉంటే వికీపీడియా మాత్రం ఆదివారం(డిసెంబర్ 13) ఎపిసోడ్ ప్రసారం కాకముందే ఫైనాలిస్ట్‌ల వివరాలతో పాటు మోనాల్ ఎలిమినేట్‌ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా వచ్చే వారం జరగబోయే ఫినాలే విన్నర్‌ను కూడా ఇప్పుడే ప్రకటించేసింది. ప్రస్తుతానికి శనివారం(డిసెంబర్ 12) జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్‌తో పాటు ‘రేస్ టూ ఫినాలే టాస్క్’ మెడల్ త్యాగం చేసిన సోహైల్ టాప్5‌లోకి రెండో కంటెస్టెంట్‌గా చేరుకున్నాడని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు.

మిగిలిన ముగ్గురు ఎవరనేది(అభిజిత్, హారిక, అరియానా, మోనాల్) ఆదివారం(డిసెంబర్ 13) ఎపిసోడ్‌లో అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా జరగకముందే ఫైనాలిస్ట్‌ల వివరాలను వికీపీడియా ముందుగానే ప్రచురించింది. అలాగే వచ్చే ఆదివారం(డిసెంబర్ 20)న జరగబోయే ఫినాలే విన్నర్‌తో పాటు రన్నరప్, మిగిలిన స్థానాల్లో నిలిచిన కంటెస్టెంట్ల పేర్లను వికీపీడియా బహిర్గతం చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటికే తప్పు తెలుసుకుని ఆ వివరాలను తొలిగించి.. కేవలం ఫైనాలిస్ట్‌ల వివరాలను మాత్రమే ఉంచింది.

Disclaimer: ఈ వార్త కేవలం వికీపీడియాలో ఉన్న విషయాలపై ఆధారంగా ప్రచురితమైంది మాత్రమే.. 

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన