హెల్త్ అలర్ట్… మీరు అతిగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా… అయితే మీపై ఈ దుష్ప్రభావం ఉండబోతోంది…

నేడు దేశంలో ఎక్కువ మందికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. గంటల తరబడి వాటిని వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్ వినియోగం, తదేకంగా ఫోన్‌ను చూస్తుండడం వలన అనేక దుష్ర్పభావాలు ఉండనున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

హెల్త్ అలర్ట్... మీరు అతిగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా... అయితే మీపై ఈ దుష్ప్రభావం ఉండబోతోంది...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 14, 2020 | 8:41 AM

నేడు దేశంలో ఎక్కువ మందికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. గంటల తరబడి వాటిని వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్ వినియోగం, తదేకంగా ఫోన్‌ను చూస్తుండడం వలన అనేక దుష్ర్పభావాలు ఉండనున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. తాజాగా వెలువడిన సర్వే ప్రకారం సెల్‌ఫోన్ మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం వలన కళ్లపై చెడు ప్రభావం ఉండనుందని తేలింది.

ఎక్కువ సమయం… ఎక్కువ ప్రభావం…

అధిక డేటా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సగటు స్మార్ట్‌ఫోన్ వాడకం సమయమూ పెరిగింది. దీంతో ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. తద్వారా సమయం వృధా పెరిగింది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా ఉపయోగించడం కళ్లపై చెడు ప్రభావం అధికంగా ఉంటోంది. అయితే స్మార్ట్‌ఫోన్ (బ్రైట్‌నెస్‌ను) ప్రకాశాన్ని పూర్తిగా ఉంచడం, నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం వలన చాలా నష్టాలు ఉన్నాయని తాజా నివేదికలో బయటపడింది.

రెటీనా దెబ్బతింటోంది…

స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే వెలుతురు ఎక్కువ పెట్టుకోవడం వలన అది మన కళ్లపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఫోన్ నుండి వెలువడే కాంతి రెటీనాను నేరుగా ప్రభావితం చేస్తోంది. దీని కారణంగా కళ్లలోని రెటీనా దెబ్బతినడంతో పాటు చూపు కూడా నెమ్మదిస్తుందని తేలింది. అంతేకాకుండా తలనొప్పి పెరుగుతుందని తేల్చారు. కళ్లలో దురద, మంటలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు తెలుపుతున్నారు. తద్వారా లాక్రిమల్ గ్రంథిపై చెడు ప్రభావాన్ని పడుతుందని అంటున్నారు.