ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నిర్ణయం మార్చుకున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ.. ఈ నెల చివరికల్లా ఖాతాల్లో..

ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఖాతాదారులకు చెల్లించే వడ్డీని ఒకేసారి..

ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నిర్ణయం మార్చుకున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ.. ఈ నెల చివరికల్లా ఖాతాల్లో..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 14, 2020 | 8:30 AM

ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఖాతాదారులకు చెల్లించే వడ్డీని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. 2019-2020 సంవత్సరానికి గానూ 8.5 శాతం వడ్డీని దఫాలుగా కాకుండా ఒకేసారి ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. అది కూడా ఈ నెలాఖరు లోపే జమ చేయనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో పీఎఫ్ మెంబర్లకు చెల్లించే 8.5 శాతం వడ్డీని వాయిదాల రూపంలో చెలల్లించాలని తొలుత నిర్ణయించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల చక్కబడటంతో ఈపీఎఫ్ఓ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు ఈపీఎఫ్ మెంబర్ల ఖాతాల్లో ఒకేసారి 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఆర్థికశాఖ నుండి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి. ఆర్థిక శాఖ నుండి ఆమోదం రాగానే సదరు వడ్డీ సొమ్ము పీఎఫ్ మెంబర్ల ఖాతాలలో జమ కానుంది.