విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించనున్న కేంద్రం.. త్వరలోనే అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష!

విద్యార్థులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఇకపై దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్ర..

విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించనున్న కేంద్రం.. త్వరలోనే అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 14, 2020 | 8:39 AM

Same Entrance Test For All Universities: విద్యార్థులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఇకపై దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020లో భాగంగా ఈ ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది.

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..

ప్రస్తుతం మెడికల్ కోర్సులకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష ఉన్నట్లుగా.. ఇంజినీరింగ్, తదితర సాంకేతిక విద్యా కోర్సులకు సైతం ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతంలోనే కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి చాలా రాష్ట్రాలు అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ఉన్నత విద్య కమిషన్ ఏర్పాటు కావడంతో.. వేర్వేరుగా ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ లాంటి ఉన్నత విద్యా విభాగాలన్నింటినీ కూడా కమిషన్‌లోకి విలీనం చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌ఈపీ-2020 కింద ఒకే ప్రవేశ పరీక్షను పెడతామని కేంద్రం ప్రతిపాదించింది.

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..

మరి ఈ అంశంపై రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన వస్తుందనేది అనుమానమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఒకే ప్రవేశ పరీక్ష పెట్టడం వల్ల ఎంసెట్ లాంటి పరీక్షలు ఉండవు కాబట్టి.. జాతీయ స్థాయి పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్లు భర్తీ చేయాల్సి వస్తుంది. మెడికల్ కాలేజీలు తక్కువ ఉండటం వల్ల నీట్ ద్వారా సీట్లు భర్తీ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది కానీ.. వందల సంఖ్యలో కాలేజీలు ఉండే మిగిలిన సాంకేతిక కోర్సులకు ఇది వీలుపడదని విద్యా నిపుణులు అంటున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read: బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!