AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి అమావాస్యకి ఓ ప్రత్యేకత ఉంది.. కోటి సూర్య గ్రహణములతో సమానమైన సోమావతి అమావాస్య.. ఇలా చేయండి..

సోమవారం- సోమావతి అమావాస్య సోమవారం, అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతీ అమావాస్య అంటారు. సోమావతి అమావాస్య.. సోమవారం డిసెంబర్ 14, 2020 న ఈ రోజున అమావాస్య..

నేటి అమావాస్యకి ఓ ప్రత్యేకత ఉంది.. కోటి సూర్య గ్రహణములతో సమానమైన సోమావతి అమావాస్య.. ఇలా చేయండి..
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2020 | 10:29 AM

Share

సోమవారం- సోమావతి అమావాస్య సోమవారం, అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతీ అమావాస్య అంటారు. సోమావతి అమావాస్య.. సోమవారం డిసెంబర్ 14, 2020 న ఈ రోజున అమావాస్య పూజ ఇంట ముగించి..

శివాలయాన్ని దర్శించాలి. అలాగే శివాలయంలో ఉండే.. రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సోమవారం వచ్చే ఈ అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. అదీ కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో ఉండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు. ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమాతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది.

సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్యను మౌని అమావాస్య , శని అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి

1. సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.

2. ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.

3. శని మంత్రాన్ని పఠించి, శ్రీ మన్నారాయణ మూర్తిని అర్చించాలి.

4. గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.

5. వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం – సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది.