కేజీహెచ్‌లో కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం..
విద్యకు, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేజీహెచ్‌లో కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన సీఎస్‌ఆర్ బ్లాక్‌ను మంత్రి అవంతి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. వైద్యులు ప్రాణాలకు తెగించి..
ముఖ్యమంత్రి జగన్ విద్యకు, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేజీహెచ్‌లో కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన సీఎస్‌ఆర్ బ్లాక్‌ను మంత్రి అవంతి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వారి సేవలు అభినందనీయమని అన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారని అన్నారు. విశాఖలో కరోనా సేవలను మెరుగుపరచటానికి కేజీహెచ్‌లో కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 500 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 175 ఐసీయూ బెడ్స్‌తో పాటుగా, 325 అన్నింటికీ ఆక్సిజన్ కలిగిన బెడ్‌లో ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు.
కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా (CSR) సీఎస్‌ఆర్ బ్లాక్ నిర్మించినట్లు పేర్కొన్నారు. పేదవారికి, మధ్యతరగతి వారికి కరోనా వైద్యం అందించటానికి ఈ బ్లాక్ ఉపయోగపడుతుందని అన్నారు. పేదవారికి మెరుగైన వైద్యం అందించటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.